Begin typing your search above and press return to search.
2000 నోటు.. బ్రహ్మాస్త్రమే
By: Tupaki Desk | 9 Nov 2016 10:10 AM GMT500 నోట్లు.. 1000 నోట్లు రద్దు చేసేస్తే.. రేపట్నుంచి పెద్ద లావాదేవీలు ఎలా.. లక్ష రూపాయలకు కూడా పెద్ద బ్యాకులో క్యాస్ పెట్టుకుని డీలింగ్స్ ఎలా చేస్తాం అని అందరూ కంగారు పడిపోయారు మొదట. ఐతే రిజర్వ్ బ్యాంకు గవర్నర్ నుంచి కాసేపటికే క్లారిఫికేషన్ వచ్చేసింది. కొత్తగా 500.. 2000 నోట్లను ప్రవేశ పెడుతున్నామని.. అవి వెంటనే చెలామణిలోకి వచ్చేస్తాయని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఐతే ఇప్పుడున్న పెద్ద నోట్లను రద్దు చేసి.. 2000 రూపాయల రూపంలో ఇంకా పెద్ద నోటు తేవడం మీద అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొంత కాలానికి ఈ నోట్లు పెరిగిపోయి.. వీటిని నల్లధనం కింద దాచుకుంటారు కదా.. ఫేక్ నోట్లు కూడా వచ్చేస్తాయి కదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇంకో ఐదేళ్లకో.. పదేళ్లకో పరిస్థితి ఇలాగే తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు నిపుణులు.
ఐతే 2000 నోటు విషయంలో అవకతవకలు జరగడానికి అవకాశమే లేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. 2000 నోటును నకిలీ చేయడానికి.. నల్లధనంగా మార్చి దాచుకోవడానికి అవకాశమే లేదన్నది ప్రభుత్వ వాదన. 2000 నోట్లలో నానో టెక్నాలజీ చిప్ అమరుస్తున్నారట. ఉపగ్రహం నుంచి వచ్చే సిగ్నల్స్ ను ఈ నోటు గ్రహించి.. ఈ నోటు ఎక్కడుందో తెలుపుతుందట. దీనికి ఏ విధమైన పవర్.. లేదా పరికరం అక్కర్లేదు. కాబట్టి నోట్లు ఎక్కడున్నాయన్నది ఈజీగా పసిగట్టొచ్చు. కాబట్టి ఐటీ రైట్స్ జరిగినపుడు ఈజీగా నోట్లను పసిగట్టవచ్చంటున్నారు. పైగా ఇప్పుడున్న పెద్ద నోట్ల స్థానంలో పది శాతం మాత్రమే కొత్త నోట్లు వస్తున్న నేపథ్యంలో బ్లాక్ మనీగా మార్చడానికి పెద్దగా అవకాశం ఉండదంటున్నారు. వీటి నకిలీ నోట్లు తయారు చేయడానికి కూడా అవకాశం లేదట. మరోవైపు 2000 నోట్లలోని చిప్ నుంచి సిగ్నల్స్ అందకుండా చేసే పరికరాలు కూడా వచ్చే ప్రమాదముందని.. ఐతే అలాంటి ప్రయత్నం చేస్తే చిప్ పని చేయకుండా పోతుందని.. ఆటోమేటిగ్గా ఆ నోటు కూడా పనికి రాకుండా పోతుందని అంటున్నారు. ఈ సమాచారం ఎంత వరకు విశ్వసనీయమో కానీ.. నిజంగా ఇంత పకడ్బందీగా నోట్లను తయారు చేసి ఉంటే మాత్రం మోడీ ప్రభుత్వానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/