Begin typing your search above and press return to search.
మళ్లీ 20వేల కోట్ల కోవిడ్ ప్యాకేజీ.. కేరళ ఘనత
By: Tupaki Desk | 5 Jun 2021 7:30 AM GMTకరోనా కల్లోలం ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఆస్పత్రుల బిల్లులు చెల్లించలేక ఆస్తులు అమ్ముకున్నవారు ఎందరో.. మృతదేహాలు ఆస్పత్రులు ఇవ్వకపోతే వదిలేసిన వారు కూడా ఉన్నారు. ఇంతటి దైన్యస్థితిలో కేరళ రాష్ట్రం ఆ రాష్ట్ర ప్రజల కోసం గొప్ప వరం ప్రకటించింది. కరోనా కట్టడి చర్యల్లో అందరి ప్రశంసలు అందుకున్న కేరళ ప్రభుత్వం తాజాగా గత ఏడాది కోవిడ్ కట్టడికి రూ.20వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది.
తాజాగా పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎన్నికలు జరిగి ఇటీవలే కొలువీరింది. మరోసారి సీఎంగా విజయన్ బాధ్యతలు స్వీకరించారు. కేబినెట్ లో మొత్తం కొత్తవారికే ఈసారి మంత్రిపదవులు ఇచ్చి ఆశ్చర్యపరిచారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్ ను ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కరోనా వైరస్ కట్టడికి తొలి వేవ్ లో రూ.20వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించినట్టుగానే.. సెకండ్ వేవ్ లోనూ ఆరోగ్యం, సామాజిక, ఆర్తిక సవాళ్లను ఎదుర్కోవడానికి రూ.20వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు.
ఇక కరోనా కట్టడి కోసం కేరళ సర్కార్ వ్యాక్సిన్లు 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం కేరళ ప్రభుత్వం రూ.1500 కోట్లు కేటాయించింది. ఉచిత టీకాలు వేయడానికి అవసరమైన పరికరాలు, సౌకర్యాలు సమకూర్చేందుకు రూ.500 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపింది. ఇక వైద్యఆరోగ్య పరిధిలో అన్ని ఆస్పత్రుల్లో సౌకర్యాలకు 666.5 కోట్లు కేటాయించారు. వైద్యాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టారు.
ఇక కరోనాతో జీవనోపాధి కోల్పోయిన తర్వాత సంక్షోభం ఎదుర్కొంటున్న వారికి ప్రత్యక్షంగా నగదు పంపిణీ కోసం రూ.8990 కోట్లు కేటాయించి కేరళ సర్కార్ ఔదార్యం చాటుకుంది.
ఈ కరోనా కల్లోలంలో ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యతనిచ్చి ఏకంగా రూ20వేల కోట్ల ప్యాకేజీ తోపాటు అందరికి ఉచితంగా టీకాలు ఇవ్వడానికి కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి.