Begin typing your search above and press return to search.
హెచ్1బీ:ముగుస్తున్న గడువు..ఎన్నారైలు ఇంటికేనా?
By: Tupaki Desk | 29 April 2020 1:04 PM GMTకరోనా మహమ్మారితో అమెరికాలో నివసిస్తున్న విదేశీయుల కలలు కల్లలవుతున్నాయి. హెచ్1బీ పేరుతో అమెరికాలో పెద్ద ఉద్యోగాలు.. వివిధ కీలక రంగాల్లో పనిచేస్తున్న వారు ఇప్పుడు గడువు దగ్గరపడడంతో ఆందోళన చెందుతున్నారు. స్వదేశాలకు వెళ్లిపోవడం తప్పదా అన్న టెన్షన్ లో పడ్డారు.
హెచ్1బీ వీసాపై పనిచేస్తున్న విదేశీయులంతా అమెరికాలో ఉద్యోగం కోల్పోతే రెండు నెలల్లో కొత్త ఉద్యోగం పొందాలి. లేదంటే అమెరికా విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో అమెరికా రికవరీ కావడానికి సంవత్సరమైనా పడుతుంది. పైగా ట్రంప్ ఫస్ట్ అమెరికన్లకే ఉద్యోగాలంటున్నారు. సంక్షోభంతో తిరిగి ఉద్యోగాలు ప్రారంభం కావాలంటే కనీసం ఆరునెలలైనా పడుతుంది. సో రెండు నెలల్లో కరోనా తగ్గేలా లేదు. అదే జరిగితే హెచ్1 బీ వీసాదారులంతా అమెరికా వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
జూన్ తో హెచ్1 బీ వీసాల గడువు ముగియబోతోంది. ఇప్పుడు కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల ఎన్నారైల ఉద్యోగాలన్నీ కోల్పోయారు. ప్రస్తుతం వారంతా జీతంలేని సెలవుల్లో ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా ప్రబలుతున్నా దృష్ట్యా దేశం వదిలి పోవడం కాదు కదా.. ఇంట్లోంచి కూడా కాలు బయట పెట్టలేని పరిస్థితి ఉంది. దీంతో లక్షలు అప్పు చేసి అమెరికాలో ఉద్యోగాలకు పోయిన వారి బతుకులు తలకిందలవుతున్నాయి. అప్పులతో స్వదేశానికి రావాల్సిన దుర్భర స్థితి నెలకొంది.
వలసలపై ట్రంప్ రెండు నెలల పాటు నిషేధం విధించారు. కొత్తగా వీసాలు.. గ్రీన్ కార్డు జారీ చేసే ప్రక్రియను ట్రంప్ నిలుపుదల చేయించారు. అయితే అమెరికాలో ఉన్న వారికి ఇవి వర్తించవని కాస్తా ఊరటనిచ్చారు. ఉద్యోగం కోల్పోయిన హెచ్1బీ వీసాదారులకు మాత్రం ఉద్యోగ భద్రత లేకపోవడం కలవరపెడుతోంది.
ప్రస్తుతం అమెరికాలో గెస్ట్ వర్కర్ వీసా కింద దాదాపు 2,50,000 మంది ఉన్నారు. వీరంతా గ్రీన్ కార్డు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో దాదాపు 2లక్షల మంది హెచ్1బీ వీసా గడువు జూన్ చివరి నాటికి ముగియనుందని ఇమిగ్రేషన్ అధికారులు తెలిపారు. దీంతో జూన్ తర్వాత పెద్ద సంఖ్యలో హెచ్1బీ వీసాదారులు స్వదేశాలకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది.
ముఖ్యంగా టెక్నాలజీ రంగానికి చెందిన వారికి ఇది పెను విఘాతంగా మారింది. కరోనా సంక్షోభం కారణంగా రెండు నెలల్లో అమెరికాలో ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్సోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోతే తిరిగి సంపాదించడం వీసాను పునురుద్దరించుకోవడం అసాధ్యమని నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇదివరకే అమెరికన్లే ఫస్ట్ అని వాళ్లకే ఉద్యోగాలివ్వాలని అధికారంలోకి వచ్చిన ట్రంప్ మళ్లీ పాత ఎజెండాను పట్టుకున్నారు. భారత్ ఇప్పటికే హెచ్1 బీ సహా వీసాలు పొడిగించాలని కోరినా స్పందించలేదు. అమెరికా దిగ్గజ కంపెనీలు కూడా ట్రంప్ కు లేఖ రాశాయి. నిపుణులైన ఉద్యోగులు పోతే అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టమని తెలిపాయి. అయితే ట్రంప్ నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో హెచ్1 బీ హోల్డర్లంతా స్వదేశానికి వెళ్లిపోవాల్సిందేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.