Begin typing your search above and press return to search.
2019 ఎన్నికలు చాలా కాస్ట్ లీ గురూ
By: Tupaki Desk | 23 Feb 2019 8:33 AM GMTమన దేశంలో ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవి. ప్రతీ ఒక్కరూ గెలుపుకోసం, ప్రతీ పార్టీ తమ అభ్యర్థుల గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడుతూనే ఉంటాయి. కులం, మతం, డబ్బు, మందు.. ఇలా ఒక్కటేంటి.. అన్ని అంశాలు గెలుపును ప్రభావితం చేస్తాయి. అందుకే.. సర్పంచ్ పదవికి కూడా మొన్నటికి మొన్న కోట్లు ఖర్చుపెట్టిన వాళ్లని చూశాం. అలాంటిది.. దేశ ప్రధానిని నిర్ణయించే ఎన్నికలు. అదీగాక.. మరో నాలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిని నిర్ణయించే ఎన్నికలు. మరి ఈ ఎన్నికల్లో ఎంత ఖర్చు అవుతుంది. ఎన్నికల కమిషన్ లిమిట్‌గా ఖర్చుపెట్టుకోమన్నా.. కమిషన్ మాట వినేదెవరు. అందుకే.. ఎన్నడూలేనంతగా.. ఈ సారి ఎన్నికల్లో ఖర్చు ఓ రేంజ్‌లో ఉంటుందట. దాదాపు రూ. 71 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట.
ఎన్నికల ఖర్చు ప్రతీ ఏడాది పెరుగుతూనే ఉంది. అయితే.. ఈ సారి ఎన్నికలు మాత్రం అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం అవ్వడంతో.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు కలిసి దాదాపు రూ.71 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు అమెరికాకు చెందిన మిలాన్ వైష్ణవ్ అనే రాజకీయ నిపుణుడు అభిప్రాయపడ్డాడు.
2016లో అమెరికా అధ్యక్ష - కాంగ్రెస్ ఎన్నికలకు అయిన వ్యయం 6.5 బిలియన్ డాలర్లు అంటే రూ.46,166 కోట్లు ఖర్చు అయ్యింది. ఇక ఇండియాలో గత ఎన్నికల్లో అంటే 2014 ఎన్నికల్లో సుమారు 5 బిలియన్ డాలర్లు అంటే రూ.35,512 కోట్లు ఖర్చైంది. ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఈ ఖర్చు డబుల్ అవుతుందట. అంటే.. దాదాపు రూ.71,025 కోట్లు ఖర్చు అవుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.