Begin typing your search above and press return to search.

ప్రపంచ దేశాలలో ట్రెండ్ గా మారిన 2020 టిప్ ఛాలెంజ్ !

By:  Tupaki Desk   |   8 Jan 2020 5:35 AM GMT
ప్రపంచ దేశాలలో ట్రెండ్ గా మారిన 2020 టిప్ ఛాలెంజ్ !
X
బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ...గ్రీన్ ఛాలెంజ్ ..రైస్ బకెట్ ఛాలెంజ్ ..ఐస్ బకెట్ ఛాలెంజ్ .. ఇలా ప్రతి ఏడాది ఏవేవో కొత్త ఛాలెంజెస్ వస్తుంటాయి. ఎక్కడో ఎవరో ప్రారంభిస్తారు. ఆ తరువాత ఆలా అది మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ఛాలెంజ్ అంటే గ్రీన్ ఛాలెంజ్ ..మొక్కలు నాటే ఛాలెంజ్. దీని పై ఇండియా లోని సెలెబ్రెటీలందరూ దాదాపుగా రియాక్ట్ అయ్యారు. ఆలా వారి అభిమానులు కూడా ఈ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఈ ఛాలెంజెస్ ని ప్రముఖులు , సినీ తారలు , సెలెబ్రెటీ లు పూర్తి చేస్తుంటారు.

ఇకపోతే , ప్రస్తుతం అమెరికా లో 2020 ఛాలెంజ్ ట్రెండ్ అయి పోయింది. కొత్త ఏడాది కానుకగా వచ్చిన ఈ 2020 ఛాలెంజ్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది. అక్కడి పలువురు సెలబ్రిటీలు.. ప్రముఖులు ఈ ఛాలెంజ్ ను తమకు తాముగా అమలు చేస్తున్నారు. ఇంతకీ ప్రస్తుతం అమెరికాలో ట్రెండ్ సృష్టిస్తున్న ఆ 2020 ఛాలెంజ్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా ? అసలు ఈ ఛాలెంజ్ ఏమిటి అంటే హోటల్ కానీ రెస్టారెంట్ కానీ తిన్న దానికి అయ్యే బిల్లు ఎంతైనా కావొచ్చు.. దాన్ని సర్వ్ చేసిన సర్వర్ కు మాత్రం 2020 డాలర్లను టిప్ గా ఇవ్వాలి. ఇది ఇప్పుడు ట్రెండ్ గా మారింది.

తాజాగా మిషిగన్ అల్సేనాలోని థండర్ బే రివర్ రెస్టారెంట్ లో డేనియన్ ఫ్రాంజోని పని చేస్తున్నారు. ఆదివారం ఒక కస్టమర్ కు ఫుడ్ సర్వ్ చేశారు. తాను తిన్న దానికి 23 డాలర్లు చెల్లించారు. కానీ.. టిప్ మాత్రం ఏకంగా 2020 డాలర్లను ఆ సర్వర్ కి ఇచ్చాడు. దీనితో ఆ రెస్టారెంట్ మేనేజర్ ఆ సర్వర్ ను పిలిచి 2020 డాలర్లు నివేనని చెప్పారు. 2020 డాలర్లు అంటే మన కరెన్సీ లో ఏకంగా రూ.1.45లక్షలు. దీన్ని ఆమె అస్సలు నమ్మలేదు. ఒక్కసారిగా అంత మొత్తాన్ని టిప్ గా ఇవ్వడంతో ఆమె ఆశ్చర్య పోయారు. ఇక్కడే మరో విశేషం ఏమిటంటే .. 2020 డాలర్లు టిప్ గా తీసుకున్న ఆ సర్వర్ ఒక హోటల్ కు వెళ్లి అక్కడ తనకు ఫుడ్ సర్వ్ చేసిన వారికి 20.20 డాలర్లను టిప్ గా ఇచ్చాడు. మిగిలిన మొత్తం లో కొంత డబ్బుతో తన డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేపించుకుంటాను అని, మిగిలిన మొత్తాన్ని దాచుకుంటానని ఆమె చెప్పారు. కొత్త సంవత్సరం వేల ఈ 2020 టిప్ చాలెంజ్ హోటల్ సర్వర్లకి మేలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ భారీ టిప్ ఛాలెంజ్ అమెరికా తో పాటుగా మరికొన్ని దేశాలలో కూడా ఒక ట్రెండ్ గా మారింది. చూడాలి మరి ఈ 2020 టిప్ ఛాలెంజ్ ని మన సినీ స్టార్స్ లో ఎవరైనా స్టార్ట్ చేస్తారేమో ...