Begin typing your search above and press return to search.
2021 ఐపీఎల్.. మా పాత ప్లేయర్స్ వీళ్లే.. ప్రకటించిన RCB!
By: Tupaki Desk | 20 Jan 2021 2:59 PM GMTకరోనా పాండమిక్ కండీషన్లో ఐపీఎల్- 2020 సీజన్ సాగుతుందా? లేదా? అని ఎన్నో అనుమానాలు! కానీ.. సందేహాలన్నింటినీ పటాలు పంచలు చేసేస్తూ.. అరబ్ కంట్రీలో ఐపీఎల్ టోర్నీ జరిగింది. ప్రేక్షకులు స్టేడియానికి రాకున్నా.. సీజన్ మాత్రం సక్సెస్ అయ్యింది. దీంతో.. రాబోయే 2021 సీజన్ ప్రక్రియను వేగవంతం చేసింది బీసీసీఐ.
వేలానికి వేళాయె..
ఇందులో భాగంగా.. ఫిబ్రవరిలోనే ఆటగాళ్ల వేలం ప్రక్రియ నిర్వహించే అవకాశముందని సమాచారం. ఈ వేలం ఫిబ్రవరి 11న నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రాథమికంగా నిర్ణయించిందని తెలుస్తోంది. అయితే.. ఈ లోగానే ఫ్రాంఛైజీల మధ్య ఆటగాళ్ల బదిలీ ప్రక్రియ ప్రారంభించింది.
వద్దనుకున్న వారెవరో చెప్పండి..
రాబోయే సీజన్లో తమకు అవసరం లేదనుకున్న క్రికెటర్లను జట్లు వదిలేసుకోవాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సూచించింది. దీంతో.. యాజమాన్యాలు తీసివేతల కార్యక్రమం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తాము రిటెన్ చేసుకునే(అట్టిపెట్టుకునే) 12 మంది ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది.
వారు వీరే..
ఆర్సీబీ యాజమాన్యం విడుదల చేసిన ఆ లిస్టులో.. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, యుజ్వేంద్ర చాహల్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, సైని, ఆడమ్ జంపా, షాబాజ్ అహ్మద్, జోష్ ఫిలిప్, కేన్ రిచర్డ్సన్, పవన్ దేశ్‌పాండే ఉన్నారు.
చెన్నైకి భజ్జీ గుడ్ బై..
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి వైదొలుగుతున్నట్టు టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్విటర్ వేదికగా ప్రకటించాడు. చెన్నై టీమ్‌తో తనకున్న రెండేళ్ల అనుబంధం బుధవారంతో ముగిసిందన్నాడు. 'ఐపీఎల్‌లో చెన్నై టీమ్‌తో నా ఒప్పందం పూర్తైంది. చెన్నై టీమ్‌కు ప్రాతినిధ్యం వహించడం గొప్ప అనుభవం. జట్టుతో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. అంతేగాక ఈ రెండేళ్లలో నన్ను గుర్తుపెట్టుకునే.. నేను గుర్తుంచుకునే స్నేహితులను పొందాను. నాకు అండగా నిలిచిన సీఎస్‌కే యాజమాన్యానికి, సిబ్బందికి, నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశాడు భజ్జీ.
భజ్జీ బంతి తిరగట్లే..
ఐపీఎల్ లో 2018 నుంచి 2020 వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు హర్భజన్. 2018లో జరిగిన వేలంలో చెన్నై జట్టు భజ్జీని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే.. ఆ సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో కేవలం 7 వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు. 2019లో మాత్రం 11 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. యూఏఈలో జరిగిన 2020 సీజన్లో వ్యక్తిగత కారణాలతో ఆడలేదు. ఈ క్రమంలో ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడీ టర్బనేటర్. ముంబై ఇండియన్స్ లో ఎక్కువకాలం పాటు కొనసాగిన భజ్జీ.. ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 160 మ్యాచ్‌లాడి 150 వికెట్లు తీశాడు.