Begin typing your search above and press return to search.

రౌండప్ : ఇండియన్ క్రికెట్ కు కలిసి రాని 2022.. ఎన్ని మ్యాచ్ లు ఓడిపోయింది..? ఎన్ని గెలిచింది..?

By:  Tupaki Desk   |   26 Dec 2022 7:18 AM GMT
రౌండప్ : ఇండియన్ క్రికెట్ కు కలిసి రాని 2022.. ఎన్ని మ్యాచ్ లు ఓడిపోయింది..? ఎన్ని గెలిచింది..?
X
2022 మరి కొన్ని రోజుల్లో కాలగర్భంలో కలిసిపోతుంది. వివిధ రంగాల్లో ఈ ఏడాదిలో జరిగిన విశేషాలు అందరూ నెమరేసుకుంటున్నారు. ప్రధానంగా క్రికెట్ రంగానికి 2022 కలిసి రాదనే చెప్పవచ్చు. సంవత్సర ఆరంభంలో కాస్త అనుకూల ఫలితాలు వచ్చినా.. ఓవరాల్ గా మాత్రం తీవ్ర విషాధాన్నే మిగిల్చింది. టీ20, ఆసియా కప్ ఓటమితో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిపోయిన రికార్డు ఈ సంవత్సరంలో టీమిండియాను మరింత కృంగదీసింది.. ఈ సంవత్సరం మొత్తం భారత జట్టు 67 మ్యాచ్ లు ఆడింది. అందులో 43 విజయాలు సాధించింది. 20 ఓడిపోయింది. వీటిలో ఆరు పరాజయాలు మాత్రం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాయి.

-టీ 20 ఫార్మాట్లో..

2021-22 సంవత్సరం టీ20 ఫార్మాట్ లో భారత్ కు చేదు అనుభవమే మిగిల్చింది. టీ-20 అంతర్జాతీయ సిరీస్ లో భారత్ గ్రూప్ స్టేజ్-5 మ్యాచ్ లు ఆడింది. వీటిలో నాలుగు మ్యాచ్ లు విజయం సాధించి సెమీస్ కు చేరింది. ఆ తరువాత ఇంగ్లాండ్ చేతిలో ఓడి ఇంటికి పయనమైంది. అయితే ప్రపంచ కప్ చేజారడంతోపాటు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ భారత్ 10 వికెట్ల తేడాతో పరాజయం కావడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది.

-వన్డేల్లో..

వన్డే సిరీస్ లోనూ భారత్ కు ఈఏడాది కలిసి రాలేదు. దక్షిణాఫ్రికాతో ఆడిన 3-0 సిరీస్ ను కోల్పోయింది. ఆ తరువాత బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ లోనూ ఇండియా ఓడిపోయింది. 2-1 తేడాతో బంగ్లాదేశ్ కప్ సాధించింది. మొత్తం ఈ ఏడాదిలో భారత్ 24 మ్యాచ్ లు ఆడగా.. 14 మాత్రమే గెలుచుకుంది.

-టెస్టుల్లో..

దక్షణాఫ్రికాతో జరిగిన టెస్ట్ క్రికెట్లోనూ ఇండియా పరాజయం పాలైంది. తొలి మ్యాచ్ విజయం సాధించిన భారత్ కు ఆశలు పెరిగినా.. ఆ తరువాత పేవల ప్రదర్శనతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ ఏడాది మొత్తంగా 7 మ్యాచ్ లు ఆడిన టీమిండియా నాలుగు మాత్రమే విజయం సాధించింది.

ఓ వైపు ఇలా వరుస ఓటమిలతో పాటు టీమిండియా జట్టులో వివాదాలు, విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. టీ 20 ప్రపంచ కప్ చేజారడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తరువాత సఫారీలు సైతం భారత్ ను ఓడించడంతో విరాట్ కోహ్లి తీవ్ర మనస్థాపం చెంది తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశారు.

దీంతో కెప్టెన్ గా రోహిత్ శర్మ నియామకమయ్యారు. అయితే రోహిత్ ఆధ్వర్యంలోనూ భారత్ ఆట తీరు మెరుగుపడలేదు. ఆయన ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉండడంతో పలు మ్యాచ్ లు ఓడిపోవాల్సి వచ్చింది. వీటికి తోడు కొందరు ప్రముఖుల ఆటగాళ్లకు గాయాలు కావడం జట్టను మరింత బలహీనం చేసింది. మొత్తంగా 2022 సంవత్సరం ఇండియన్ క్రికెట్ కు కలిసి రాలేదని చెప్పవచ్చు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.