Begin typing your search above and press return to search.

ఇంత‌టి భాగ్యం ఏపీ ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే ద‌క్కిందా..!

By:  Tupaki Desk   |   6 Dec 2022 1:30 PM GMT
ఇంత‌టి భాగ్యం ఏపీ ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే ద‌క్కిందా..!
X
వ‌చ్చే 2024లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇదీ.. వైసీపీ నేత‌ల మాట‌. కానీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ మాత్రం ఎప్పుడైనా ఎన్నిక‌లు రావొచ్చ‌ని.. దీనికి త‌గిన విధంగా త‌మ్ముళ్లు రెడీ అవ్వాల‌ని చెబుతోంది. ఎందుకంటే, అధికార పార్టీ వైసీపీ దూకుడు చూస్తే అలానే ఉంది. దీంతో టీడీపీ కూడా త‌న దూకుడును పెంచేసింది. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కుల‌ను ముందుండి న‌డిపించేలా పార్టీ అధినేత‌లు ఇద్ద‌రూ కూడా క‌ష్ట‌ప‌డుతున్నారు.

వైసీపీ అధినేత, సీఎంజ‌గ‌న్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ.. ఏడాదిన్న‌ర ముందుగానే ఎన్నిక‌ల‌కు సంబంధించిన క‌స‌ర‌త్తును ప్రారంభించ‌డంతోపాటు.. నాయ‌కుల‌ను కూడా ముందుండి న‌డిపిస్తున్నారు. తాను కూడా ఎక్క‌డ అవ‌కాశం చిక్కితే అక్క‌డ స‌భ‌ల్లో దంచి కొడుతున్నారు. త‌న‌ను చూసి ఓటేయాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిస్తున్నారు. ప్ర‌తిప‌క్షాలు త‌న‌పైనా.. త‌న ప్ర‌భుత్వంపైనా కుట్ర‌లు చేస్తున్నార‌ని జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్నారు.

ఇక‌, వైసీపీ దూకుడును గ‌మ‌నించిన టీడీపీ నేత‌లు..కూడా త‌మ‌దైన శైలిలో ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య త్నం చేస్తున్నారు. వైసీపీ గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని చేప‌డితే.. ఇంతే మాస్ రేంజ్‌లో ఇదేం ఖ‌ర్మ కార్య‌క్ర‌మానికి టీడీపీ శ్రీకారం చుట్టింది.

మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలో ఇప్పుడున్న‌, ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీల మ‌ధ్యే ప్ర‌ధాన ఎన్నికల పోరు సాగ‌నుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

దీంతో ఇత‌ర పార్టీలు.. దాదాపు త‌ప్పుకొన్న‌ట్టుగానే క‌నిపిస్తోంది. అంటే, 2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎవ‌రు బ‌రిలో ఉంటారు? ఏయే పార్టీల మ‌ధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది? అనే విష‌యాలు స్ప‌ష్ట‌మైపోయాయి. సో.. ఇక‌, తేల్చుకోవాల్సింది ఎవ‌రంటే.. ప్ర‌జ‌లే. వారే న్యాయ నిర్ణేత‌లుగా మార‌నున్నారు.

అయితే, సాధార‌ణంగా ఎక్క‌డైనా ఎన్నిక‌ల‌కు ఆరు మాసాల ముందు మాత్ర‌మే ప్ర‌జ‌ల‌కు ఆలోచించుకునే స‌మ‌యం ఉండ‌డం స‌హ‌జం. కానీ, ఏపీలో మాత్రం ఏడాదిన్న‌ర ముందుగానే ప్ర‌జ‌ల‌కు ఆలోచించుకుని ఓటేసే భాగ్యం క‌ల‌గ‌డం గ‌మ‌నార్హం.