Begin typing your search above and press return to search.

చేసేది భిక్షాటన.. తిరిగేది బెంజ్ కార్లు

By:  Tupaki Desk   |   19 July 2017 6:59 AM GMT
చేసేది భిక్షాటన.. తిరిగేది బెంజ్ కార్లు
X
బహ్రయిన్ లోని మనామా నగరంలో పోలీసులు అరెస్టు చేసిన ఓ కుటుంబం గురించి వింటే షాకవుతాం. మొత్తం 21 మంది సభ్యులున్న ఆ కుటుంబం బ్యాక్ గ్రౌండ్ వింటే ఆశ్చర్యపోతాం. ఆ 21 మంది కూడా రోడ్లపై యాచన చేస్తుంటారు. కానీ... వారి సంపద మాత్రం అరబ్ షేక్ లకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉందట. అయినా.. అదేం బుద్ధో కానీ ఇంటిల్లిపాదీ యాచన చేస్తున్నారట.

మనామాలో యాచన చేస్తూ దొరికిన 21 మందిని అరెస్టు చేయగా వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని తేలింది. బ్రహ్మాండమైన అపార్టుమెంటులో వారంతా విలాసవంతమైన జీవనం గడుపుతున్నారట. అంతేకాదు, వారికి అయిదు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. అందులో కొన్ని బాగా కాస్ట్లీవయిన బెంజ్ కార్లూ ఉన్నాయి.

ఉదయాన్నే కార్లలో బయలుదేరి వెళ్లడం. రోడ్లపై ఎక్కడో ఒక చోట ఆపి అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నామని, డబ్బు అవసరమని, దానం చేయాలంటూ అడగడం వీరి పని. ఈ సంగతి పసిగట్టి పోలీసులు మొత్తం ఫ్యామిలీనంతటినీ జైళ్లో పెట్టారు.

కాగా గల్ఫ్ దేశాల్లో యాచన నేరం. కానీ.. ఈజీగా డబ్బు సంపాదించడం కోసం చాలామంది ఈ మార్గం ఎంచుకుంటున్నారట. స్థానికులే కాదు, బయట దేశాల నుంచి కూడా ఇక్కడ అడుక్కోవడానికి వస్తుండడంతో పోలీసులకు పని పెరిగిపోతుందట.