Begin typing your search above and press return to search.
దాక్కున్న ఆ 21మందికి కరోనా పాజిటివ్
By: Tupaki Desk | 11 April 2020 6:45 AM GMTదేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అత్యధిక మరణాలతో పాటు భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 1,364 కేసులు నమోదు కాగా, 125మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. కరోనా అదుపులో ఉన్న సమయంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన తబ్లిగి జమాత్ ప్రార్థనలకు వెళ్లిన వచ్చిన వారితో ఒక్కసారిగా మహారాష్ట్రలో కరోనా కేసులు రెట్టింపు స్థాయిలో పెరిగాయి. దీనికి ప్రధాన కారణం మర్కజ్‌కు వెళ్లిన వారు కరోనా పరీక్షలకు ముందుకు రాకపోవడంతో ఆ కేసులు మరింత పెరిగాయి. తాజాగా అలాంటి ఘటన మరొకటి వెలుగుచూసింది. తబ్లిగీ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారు ప్రభుత్వానికి నివేదిక అందించలేదు. వారు దాక్కోవడంతో కేసులు పెరుగుతున్నాయి. అయితే వారిని అణువణువు పరిశీలించి దొరికిన వారందరినీ అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఢిల్లీలో ఆ సమావేశానికి వెళ్లిన వారి జాబితాను రూపొందించి వారిని గుర్తించే పనిలో భాగంగా అధికారులు తనిఖీలు నిర్వహించగా దాక్కున్న 21మంది కనిపించారు. వారందరికీ వైద్యపరీక్షలు నిర్వహించి క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఈ క్రమంలో వారందరికీ కరోనా పాజిటివ్ సోకిందని తేలింది. దీంతో ముంబైకి సమీపంలోని ముబ్రా పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం రేగింది.
ముబ్రా పోలీస్ స్టేషన్ కు చెందిన ఓ పోలీస్ సీనియర్ అధికారి చేసిన ప్రత్యేక తనిఖీల్లో 21 మంది విదేశీయులు పట్టుబడ్డారు. వీరందరూ మర్కజ్‌లో పాల్గొన్నవారని తేలింది. ఆ 21 మంది విదేశీయులకు కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తేలడంతో చికిత్స నిమిత్తం క్వారంటైన్ కు తరలించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం తనిఖీలను ముమ్మరం చేసింది. వీరు ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారనే విషయమై అధికార యంత్రాగం ఆరా తీస్తోంది. అయితే వీరికి ఆశ్రయం ఇచ్చిన స్థానిక మసీదులు, పాఠశాలలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వారంతా మర్కజ్ సమావేశం తర్వాత తమిళనాడు నుంచి ముంబై మీదుగా ముబ్రాకు చేరుకున్నారు. ఆ 21 మందిలో 13 మంది బంగ్లాదేశీయలు, 8 మంది మలేషియన్లు గా గుర్తించారు. అధికారులకు సమాచారం ఇవ్వకుండా విదేశీయులకు ఆశ్రయం ఇవ్వడం నేరంగా గుర్తించి పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు.