Begin typing your search above and press return to search.
టపాసులు కాల్చినందుకు ఢిల్లీలో 210 మంది అరెస్ట్
By: Tupaki Desk | 29 Oct 2019 6:48 AM GMTమీరు చదివింది కరెక్టే. సంచలనం కోసం ఈ విషయాన్ని చెప్పటం లేదు. దేశ రాజధానిలో పరిస్థితి ఎంత కఠినంగా ఉందన్న విషయాన్ని తెలియజేసే ఉదంతంగా దీన్ని చెప్పాలి. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో దాన్ని అరికట్టేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా దీపావళి వేళ.. కేవలం రెండు రకాల టపాసులు తప్పించి.. మిగిలిన వాటిని కాల్చొద్దంటూ నిషేధం విదించారు. అంతేకాదు.. కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలన్న రూల్ ను తీసుకొచ్చారు.
పండుగ వేళ ఇలాంటి రూల్స్ పెట్టటం ఏమిటని అనుకున్నారో? నిజంగానే వారికి ఆ రూల్స్ తెలియవో కానీ.. 371 మంది పండుగ వేళ అడ్డంగా బుక్ అయ్యారు. వీరిలో 210 మంది పరిస్థితి అయితే మరింత దారుణం. ఎందుకంటే.. టపాసులు కాల్చిన పాపానికి వారు ఏకంగా జైలుపాలైన పరిస్థితి. ఢిల్లీ అధికారులు జరిపిన తనిఖీలతో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది.
అక్రమంగా టపాసుల్ని నిల్వ ఉంచినందుకు 44 మందిని అరెస్ట్ చేస్తే.. నిబంధనలకు విరుద్ధంగా టపాసులు కాల్చినందుకు (ప్రభుత్వం చెప్పిన రెండు రకాలు కాకుండా వేరే వాటిని కాల్చటం.. నిర్ణీత రెండు గంటలు కాకుండా ఎక్కువ సమయం కాల్చటం) 315 కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో రెండు గంటల కంటే మించి టపాసులు కాల్చినందుకు వారిపై కేసులు నమోదు చేయటమే కాదు.. ఈ కేసులో 166 మందిని అరెస్ట్ చేయటం గమనార్హం.
వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ తో తాము 3,764 కేజీల టపాసుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. తమకు దీపావళివేళ మొత్తం 940 ఫోన్ కాల్స్ వచ్చాయని.. వాటి ఆధారంగా పెద్ద ఎత్తున అరెస్టులు చేసినట్లుగా వారు చెబుతున్నారు. దేశంలో ఎన్నో నేరాలు చేస్తున్న వారి సంగతి ఎలా ఉన్నా.. దీపావళి పండుగ వేళ.. టపాసులు కాల్చే దానికి కూడా అరెస్ట్ తప్పని దుస్థితి రావటానికి మించిన బ్యాడ్ లక్ ఇంకేం ఉంటుంది చెప్పండి?