Begin typing your search above and press return to search.

తబ్లీగీ ఎఫెక్ట్‌: కరోనా అనుమానితులు 22 వేల మంది

By:  Tupaki Desk   |   5 April 2020 8:10 AM GMT
తబ్లీగీ ఎఫెక్ట్‌: కరోనా అనుమానితులు 22 వేల మంది
X
ఢిల్లీలో జరిగిన తబ్లీగీ జమాత్‌ సమావేశానికి వేల సంఖ్యలో ప్రజలు దేశ నలుమూలలా తరలివచ్చారు. అయితే ఆ ప్రార్థనలకు వెళ్లిన వారికి కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాపించింది. అయితే వారు ప్రార్థనలకు వెళ్లొచ్చిన అనంతరం నేరుగా ఇళ్లకు వెళ్లడం.. తమ ప్రాంతాల్లో తిరగడంతో ప్రస్తుతం దేశంలో కలకలం రేగుతోంది. అయితే వారిని గుర్తించేందుకు రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. అయితే ఆ ప్రార్థనలకు వెళ్లిన వారితో సంబంధం ఉన్నవారు పెద్దసంఖ్యలో ఉన్నారని భారత ప్రభుత్వం గుర్తించింది. ఏకంగా ఆ సమావేశానికి వెళ్లిన వారితో సంబంధం ఉన్న వారు మొత్తం 22 వేల మంది ఉన్నారని.. వారంతా కరోనా వైరస్‌ అనుమానితులుగా గుర్తించినట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది.

రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని ఆ సమావేశానికి వెళ్లిన వారితో పాటు వారితో సత్సబంధాలు కలిగి.. వారితో తిరిగిన వారందర్నీ పట్టుకొని కరోనా పరీక్షలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అందులో భాగంగానే అలాంటి వారిలోనే ఇప్పటివరకు 1,023 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఈ లెక్కలు 17 రాష్ట్రాలకు చెందినవని.. ఆ రాష్ట్రాల్లో ఈ విధంగా వైరస్‌ విస్తరించి ఉన్నట్లు గుర్తించింది. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 2,902 నమోదు కాగా వాటిలో తబ్లీగీ జమాత్‌ వాటాయే 30 శాతం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి.. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో వలస కూలీలు - ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునేందుకు విపత్తు నిర్వహణ నిధి కింద రాష్ట్రాలకు రూ. 11,092 కోట్లు విడుదల చేసినట్లు హోంశాఖ సంయుక్త కార్యదర్శి పూనియా సలీలా శ్రీవాస్తవ - ఆర్యోగశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఆ నిధిని వలస కార్మికుల సహాయక చర్యలకు వాడాలని ఆదేశించారు. అయితే దేశంలో తబ్లీగీ జమాత్‌ వంటి సమాశాలు చాలాచోట్ల జరిగాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఆ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఉన్న షహదనావాలీ దర్గా వద్ద అలాంటిదే జరిగినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆ కార్యక్రమాలో పాల్గొన్న 200 మందిని క్వారంటైన్‌ కు తరలించారు. ఇక ఇలాంటి సమావేశాలు రాజస్థాన్‌ - మధ్యప్రదేశ్‌ తో పాటు ఇతర రాష్ట్రాల్లో చాలా చోట్ల జరిగాయని.. ఆ సమావేశాల్లో పాల్గొన్న వారిని అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. ఈక్రమంలోనే రాజస్థాన్‌ లోని 5 జిల్లాల్లో 5 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి.