Begin typing your search above and press return to search.

ఒక్క నెంబర్ నుండి 22 కోట్ల కాల్స్

By:  Tupaki Desk   |   18 Dec 2021 1:24 PM GMT
ఒక్క నెంబర్ నుండి 22 కోట్ల కాల్స్
X
కాలర్ ఐడెంటిఫికేషన్ తెలిపే ట్రూ కాలర్ ఏడాదికిగాను ఒక రిపోర్ట్ ను ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కాల్ సంబంధించి విస్తృత స్థాయిలో రిపోర్టును తయారు చేసింది. అయితే రిపోర్టులు భారత్ కు సంబంధించి కొన్ని కీలక విషయాలను వెల్లడించింది ట్రూ కాలర్. ఓ ప్రైవేట్ నెంబర్ నుంచి వివిధ రకాల వినియోగదారులకు సుమారు 22 కోట్లకు పైగా కాల్స్ వెళ్లాయని తెలిపింది. అంటే రోజుకు అంచనాగా ఆరు లక్షల మందికి పైగా ఒకే నంబర్ నుంచి కాల్స్ వెళ్లినట్లు స్పష్టం చేసింది. ఇది నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా కానీ ఇది నిజం అని తెలిపింది. ఈ ఏడాది కాల్స్ కు సంబంధించి 2021 స్పామ్ కాల్స్ రిపోర్ట్ పేరుతో అంతర్జాతీయంగా దీనిని ప్రచురించింది ట్రూ కాలర్. ఈ రిపోర్టును ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉన్న డేటా ప్రకారం రూపొందించినట్లు ట్రూకాలర్ తెలిపింది.

వివిధ దేశాల్లో చేపట్టిన ఈ ఈ సర్వే ప్రకారం ట్రూకాలర్ చెప్పిన కొన్ని కీలక విషయాలు ఏమిటంటే స్పామ్ కాల్స్ చేసే వారిలో ఎక్కువ మంది ఒకే నంబర్ను ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ అన్వాంటెడ్ కాల్స్ ను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇందుకు గాను ఓ ప్రత్యేక సాంకేతికతను రూపొందించినట్లు పేర్కొంది. ఇలా చేయడం వల్ల వినియోగదారులు అనవసర కాల్స్ మాట్లాడేందుకు ఖర్చు చేసి సమయాన్ని కాపడినట్లు వివరించింది. మన దేశం లోని ఓ నంబర్ నుంచి ఇరవై కోట్లకు పైగా కాల్స్ వినియోగదారులకు వెళ్లాయని తెలిపిన సంస్థ.. వాటిని ఆటోమేటిక్ గా గుర్తించి తక్షణమే బ్లాక్ చేసినట్లుగా చెప్పుకొచ్చింది.

ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ లో స్పామ్ కాల్స్ తక్కువే అని పేర్కొంది. ఈ జాబితాలో మన దేశం నాలుగో స్థానంలో ఉన్నట్లు ట్రూ కాలర్ తెలిపింది. సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం సగటున ప్రతి వినియోగదారుడుకి నెట్వర్క్ తో సంబంధం లేకుండా కనీసం 16 స్పామ్ కాల్స్ వస్తున్నాయని వివరించింది.

ఇతర దేశాలతో పోల్చితే ఇది తక్కువే అని ప్రకటించింది. ఈ స్పామ్ కాల్స్ గ్లోబల్ రిపోర్ట్ లో మొదటి స్థానంలో బ్రెజిల్ ఉన్నట్లు తెలిపింది. ఈ దేశంలో ఎక్కువ 33 స్పామ్ కాల్స్ ఒక వినియోగదారుడికి వస్తున్నట్లు ట్రూ కాలర్ స్పష్టం చేసింది. అంతేకాకుండా పెరు రెండో స్థానంలో ఉన్నట్లు సంస్థ ప్రకటించిన రిపోర్ట్ లో పేర్కొంది. ఈ దేశంలో ఉన్న వాళ్లు సగటున రోజుకు 18 స్పామ్ కాల్స్ అటెండ్ అవుతున్నట్లు వివరించింది.

ట్రూ కాలర్ ప్రతి ఏడాది స్పామ్ కాల్స్ జాబితాను విడుదల చేస్తుంది. అయితే భారత్ ఈ ఏడాది నాలుగో స్థానానికి పరిమితం కాగ.. పోయిన సంవత్సరంలో 9 స్థానాల్లో ఉంది. ఇదిలా ఉంటే భారత్ లో స్పామ్ కాల్స్ సంఖ్య అమాంతం పెరిగిపోగా... మరో వైపు స్కాం కాల్ సంఖ్య తగ్గినట్లు ట్రూ కాలర్ పేర్కొంది. ప్రపంచ దేశాల్లో ఎక్కువగా స్పామ్ కాల్స్ బిట్ కాయిన్ లాంటి వాటి మీదే వస్తున్నట్లు అంచనా వేసింది.