Begin typing your search above and press return to search.
ఆ 22 మంది ఆఫీసర్లు బాబుకు సమాచారం ఇస్తున్నారా?
By: Tupaki Desk | 29 Nov 2019 2:30 PM GMTతెలుగుదేశం హయాంలో సెక్రటేరియట్ లో చక్రం తిప్పిన కొంతమంది అధికారులు ఇప్పటికీ అవే స్థానాల్లో కొనసాగుతూ ఉన్నారని సమాచారం. చంద్రబాబు, లోకేష్ ల హయాంలో నియమితం అయిన వాళ్లు.. ఇప్పటికీ వారికే చంచాగిరి చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
తను నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవితో మంత్రి పదవిని తీసుకోక ముందు నుంచినే లోకేష్ బాబు సెక్రటేరియట్ మీద కన్నేశారు. సెక్రటేరియట్ నిండా తన చెంచాలను నింపేశాడట లోకేష్. అప్పట్లోనే ఆ మేరకు ప్రచారం జరిగింది. కొంతమంది ప్రైవేట్ ఉద్యోగులను అలా నియమించుకోవడమే కాకుండా, అన్ని శాఖలకూ తమకు అనుకూలమైన మనుషులనే ఉద్యోగులకు పంపినట్టుగా తెలుస్తోంది.
ఏతావాతా అప్పుడు సెక్రటేరియట్ నుంచి సొంత వాళ్లను పెట్టుకుని, అన్ని వ్యవహారాలనూ శాసించారు లోకేష్. పదవిలోకి రాకముందే అలా వ్యవహరించారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ మంత్రుల మీద నిఘాను పెట్టడానికి, వారిని ఎవరు వచ్చి కలుస్తారనే అంశాలను తెలుసుకోవడానికి కూడా ఆ ఉద్యోగులనే నియమించుకున్నారు కూడా.
అలాంటి ఉద్యోగులు ఇప్పటికీ అదే పని చేస్తున్నారని సమాచారం. సెక్రటేరియట్ లో మొత్తం ఇరవై రెండు మంది ఉద్యోగులు పూర్తిగా చంద్రబాబు పార్టీ అని, వారు ఇప్పటి కూడా సెక్రటేరియట్ లో ఏం జరుగుతున్నదీ ఎప్పటికప్పుడు చంద్రబాబుకు సమాచారం ఇస్తూ ఉన్నారని సమాచారం.
అధికారుల బదిలీల విషయంలో ముఖ్యమంత్రి స్ట్రిక్ట్ గానే ఉన్నా, చంద్రబాబు మనుషులను సాగనంపాలని సూచిస్తున్నా.. ఆ ఉద్యోగులు మాత్రం ఎలాగోలా అక్కడే ఉండేందుకు లాబీయింగ్ లు చేసుకుంటూ.. చంద్రబాబుకు తమ సేవలను కొనసాగిస్తూ ఉన్నట్టుగా భోగట్టా.