Begin typing your search above and press return to search.
90 ఏళ్ల వృద్ధురాలిపై 22 ఏళ్ల యువకుడి హత్యాచారం ..సొసైటీ ఎటు వెళ్తుంది ?
By: Tupaki Desk | 2 March 2020 9:30 AM GMTనిర్భయ , దిశ ..ఇలా నిత్యం ఎంతోమంది కామాంధుల చేతుల్లో చిక్కి బలైపోతున్నారు. అలాంటి మానవ మృగాళ్ల చేతుల్లో చిక్కి నలిగి పోతున్న అమాయకమైన ఆడపిల్లలని , మహిళలని కాపాడటానికి ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా కూడా మహిళలపై జరిగే అఘాయిత్యాలు మాత్రం తగ్గడంలేదు. తెలంగాణలో దిశ నిందుతుల ఎన్ కౌంటర్ తరువాత మహిళలపై జరిగే దాడులు తగ్గుముఖం పడతాయి అనుకుంటే ..అసలు దిశ నిందితుల ఎన్ కౌంటర్ ప్రభావం కనిపించడమే లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట బాలికలు, యువతులు, మహిళలపై కామాంధులు దాడికి పాల్పడుతూనే ఉన్నారు.
తాజాగా నల్గొండ జిల్లా అనుముల మండలంలో మరో దారుణమైన సంఘటన ఒకటి జరిగింది. ఆ సంఘటన గురించి తెలుసుకుంటే .. ఇలాంటి వారు ఉన్న సమాజంలో మనం నివసిస్తున్నామా అని అనిపించకమానదు. ఒంటరిగా నివసిస్తున్న 90 ఏళ్ల వృద్ధురాలిపై ఓ తాగుబోతు అత్యాచారం చేసి హత్య చేశాడు.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ..అనుముల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వృద్ధురాలు గ్రామ శివారులోని ఒక గుడిసె లో ఒంటరిగా నివాసం ఉంటుంది.అయితే, ఆదివారం ఉదయం టీ ఇవ్వడానికి ఆమె కోడలు వెళ్లగా వృద్ధురాలు విగతజీవిగా పడి ఉంది. అలాగే ఆమె ఒంటిపై రక్తపు మరకలు, పంటిగాట్లు, గోళ్లతో రక్కిన ఆనవాళ్లను గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.
కాగా, అదే గ్రామానికి చెందిన సత్రశాల శంకర్ అనే , 22 ఏళ్ల యువకుడు శనివారం సాయంత్రం నుంచి మద్యం తాగి తన తల్లి ఇంటి వద్ద తిరుగుతూ కనిపించాడని, అతడే తన తల్లిపై అత్యాచారానికి పాల్పడి చంపేశాడని పెద్ద కుమారుడు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సత్రశాల శంకర్ గతంలోనూ రెండుసార్లు మద్యం మత్తులో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ సంఘటనలలో గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి అతన్ని మందలించినట్టు స్థానికులు చెప్తున్నారు.