Begin typing your search above and press return to search.
భారత్ లో కరోనా విజృంభణ మళ్లీ మొదలు ... ఒక్క రోజే 22 వేల కొత్త కేసులు !
By: Tupaki Desk | 11 March 2021 8:30 AM GMTదేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా నిత్యం దాదాపు పది వేలకి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నా కూడా , గడిచిన 24 గంటల్లో 22,854 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. అలాగే గత 24 గంటల్లో 126 మంది కరోనాకు బలయ్యారు.
నిన్న భారత్‌లో కొత్తగా 17,921 మందికి కరోనా నిర్ధారణ కాగా, గత 24 గంటల్లో 22,854 మందికి కరోనా నిర్ధారణ అయింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం... 18,100 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,85,561కు చేరింది. 24 గంటల సమయంలో 126 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,189కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,09,38,146 మంది కోలుకున్నారు. 1,89,226 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్ లలో చికిత్స అందుతోంది. అలాగే , గడిచిన 24గంటల్లో 7లక్షల 78వేల 416 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. నిత్యం సుమారు 10వేల కేసులు నమోదవుతున్నాయి. నిన్న మాత్రం అత్యధికంగా 13వేల 659 కొత్త కేసులు బయటపడ్డాయి. 54 మంది కరోనాకు బలయ్యారు. మహారాష్ట్రలో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలోని కొత్త కేసులు, మరణాల విషయంలో మహారాష్ట్రలోనే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇక తెలంగాణలో కొత్తగా 194 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 116 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,536 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,97,032 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,649గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,855 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.