Begin typing your search above and press return to search.

ఘోరం: మ‌హిళ‌పై 23 మంది అత్యాచారం

By:  Tupaki Desk   |   28 Sep 2017 5:06 PM GMT
ఘోరం: మ‌హిళ‌పై 23 మంది అత్యాచారం
X
మాయ‌మై పోతున్న‌డ‌మ్మా.. మ‌నిష‌న్న‌వాడు..! అన్న మాట అక్ష‌రాలా నిరూపించాయి మ‌నిషి రూపంలో ఉన్న మృగాలు! ఓ మ‌హిళ‌ను బంధించి అత్యంత పాశ‌వికంగా అత్యాచారానికి పాల్ప‌డ‌డ‌మే కాకుండా ఈ ఘోరాన్ని వీడియోలోనూ చిత్రీక‌రించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ ఘోరానికి సంబంధించి ఇద్ద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారికోసం వెతుకుతున్నారు. అత్యంత దారుణ‌మైన ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని బిక‌నీర్‌ లో చోటు చేసుకుంది.

వివ‌రాలు... ఢిల్లీకి చెందిన ఓ మ‌హిళ‌.. రాజస్థాన్‌ బికనీర్‌ లోని రిద్‌ మల్సార్‌ పురోహితన్‌ ప్రాంతంలో తాను గ‌తంలో కొనుగోలు చేసిన ఓ ఫ్లాట్‌ ను చూసేందుకు ఈ నెల 25న అక్క‌డికి వెళ్లింది. ఫ్లాట్ మంచీ చెడూ చూసుకున్నాక‌, తిరిగి ఆమె ఢిల్లీకి ప‌య‌న‌మైంది. ఈ క్ర‌మంలో బిక‌నీర్‌ లోని శ్యామ్‌ మందిర్‌ ఆలయం వద్ద వాహనం కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ ఎస్‌ యూవీ వాహనంలో నుంచి కొంతమంది వచ్చి ఆమెను వాహనంలోకి ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత కొన్ని గుట్టలు ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు.

తొలుత ఇద్దరు ఆ తర్వాత ఆరుగురు ఈ వికృతచర్యకు దిగారు. త‌ర్వాత‌ ఓ పవర్‌ సబ్‌ స్టేషన్‌ వద్దకు తీసుకెళ్లగా అక్కడకు మరికొంతమంది వచ్చి మరోసారి లైంగికదాడికి దిగారు. ఇలా మొత్తం 23మంది ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కాగా, ఈ అత్యాచారానికి ఒడిగ‌ట్టిన మృగాల్లోని ఇద్ద‌రు 26న ఉదయం 4గంటల ప్రాంతంలో బిక‌నీర్‌లో వాహ‌నం కోసం ఎదురు చూసిన ప్రాంతంలో విడిచి వెళ్లిన‌ట్టు చెప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు మృగాల వేట‌ను ముమ్మ‌రం చేశారు. వీరిలో ఇప్ప‌టికి ఇద్ద‌రిని అరెస్టు చేశారు. కాగా, ఈ ఘ‌ట‌న రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపింది.