Begin typing your search above and press return to search.
ఏంది బాబు.. ‘23’ ఇంతలా వెంటాడుతోంది?
By: Tupaki Desk | 17 March 2021 6:30 AM GMTఆరు అన్నంతనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుకు వస్తారు. అది ఆయన లక్కీ నెంబరు. అందుకే.. తాను చేసే ప్రతి పనిలోనూ ఆరు అంకె మిస్ కాకుండా చూస్తుంటారు. కొన్ని సందర్భాల్లో కేసీఆర్ తీసుకునే నిర్ణయాలకు.. ఆరు అంకెకు మధ్య ఉన్న సంబంధాన్నిపట్టుబట్టి మరీ బయటకు తీసేందుకు కొందరు జర్నలిస్టులు పడే ప్రయాస అంతా ఇంతా కాదు. ఆరు అంకె సంగతి ఇలా ఉంటే.. తాజాగా ‘23’ అంకె కనిపించినంతనే చంద్రబాబు గుర్తుకు వచ్చేస్తున్నారు.
2019 సార్వత్రి ఎన్నికల్లో ఆయన పార్టీ దారుణంగా ఓటమి పాలు కావటం.. 23 సీట్లు మాత్రమే ఆయన పార్టీకి దక్కటం.. అంతకు ముందు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్ని ఆయన తన పార్టీలోకి చేర్చుకోవటంతో ‘23’ అందరిలోనూ నానింది. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్ని తీసేసుకున్న పాపం.. ఆయన్ను వెంటాడి.. చివరకు 23 సీట్లు వచ్చాయన్నది వైసీపీ నేతల ఉవాచ.
ఏదో అనుకోకుండా జరిగిందిలే అని సరిపెట్టుకుందామనుకున్నా.. అదే పనిగా ‘23’ను గుర్తు చేసేలా తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికర చర్చకు తెర తీస్తున్నాయి. తాజాగా అమరావతి భూముల్లో దారుణం జరిగిందని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి సీఐడీకి ఇచ్చిన కంప్లైంట్ కు స్పందించి.. హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటికి వచ్చిమరీ నోటీసులు జారీ చేయటం.. ఈ నెల ‘23’న విచారణకు హాజరుకావాలని చెప్పటం తెలిసిందే. ఒకవేళ విచారణకు గైర్హాజరీ అయితే అరెస్టు తప్పదన్న హెచ్చరికను చేసినట్లుగా చెబుతున్నారు.
ఎప్పుడైతే ‘23’న విచారణకు రమ్మని సీఐడీ నోటీసులు జారీ చేసిందో.. ఆ వెంటనే బాబు జీవితంలో ‘23’కు ఉన్న అనుబంధం మీద కొందరి చూపు పడింది. వెంటనే వెతికిన వారు కొన్ని కొత్త విషయాల్ని గుర్తించారు. అందులో ముఖ్యమైనది ఆయన కుమారుడు నారా లోకేశ్ పుట్టింది జనవరి 23 అన్న విషయాన్ని గుర్తించారు. అంతేనా.. 2019 ఎన్నికల్లో 23 సీట్లు వచ్చి.. దారుణ ఓటమికి కారణమైంది కూడా ‘మే 23’ కావటం ఆసక్తికరంగా మారింది.
అంతేనా.. ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నది కూడా ఆగస్టు 23, 1995 అన్న విషయాన్నిపాత న్యూస్ పేపర్లు కలెక్టు చేసిన వారు చెబుతున్నారు. అమరావతిని రాజధానిగా ఎంపిక చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కూడా ఏప్రిల్ 23, 2015 కావటం గమనార్హం. ఇలా.. ప్రతి విషయంలోనూ.. బాబును వెంటాడుతున్న ‘23’ రానున్న రోజుల్లో ఎక్కడి వరకు తీసుకెళుతుందన్నది ప్రశ్నగా మారింది.
ఇదే విషయాన్ని వ్యంగ్యంగా పలువురు వైసీపీ అభిమానులు పోస్టులు పెట్టేయటం గమనార్హం ‘పప్పు పుట్టింది 23నే.. లాక్కున్న ఎమ్మెల్యే 23.. 23 సీట్లు వచ్చిన తర్వాత.. 23 నెలలకు సీఐడీ విచారణకు రమ్మన్నది 23నే’.. అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్ గా మారాయి.