Begin typing your search above and press return to search.

ఉద్యోగాల్లో టాప్.. ఆ కోర్సులు చేసినోళ్లకేనట

By:  Tupaki Desk   |   14 Jan 2020 1:30 AM GMT
ఉద్యోగాల్లో టాప్.. ఆ కోర్సులు చేసినోళ్లకేనట
X
ఆసక్తికర నివేదిక ఒకటి విడుదలైంది. గడిచిన మూడేళ్లలో ఉద్యోగాలు వెంటనే వచ్చిన వారెవరన్న విషయం పై ఒక వెబ్ సైట్ అధ్యయనాన్ని చేపట్టింది. మూడేళ్లు గా సదరు వెబ్ సైట్ ద్వారా పొందిన ఉద్యోగాల ఆధారంగా ఈ నివేదికను సిద్ధం చేశారు. తాజాగా సదరు సైట్.. తన నివేదికను వెల్లడించింది.

2016 నుంచి 2019 మధ్య కాలంలో ఉద్యోగ అవకాశాల్ని సొంతం చేసుకున్న వారిలో అత్యధికులు సైన్స్.. టెక్నాలజీ.. ఇంజనీరింగ్.. మ్యాథ్స్ కోర్సులు (స్టెమ్) పూర్తి చేసిన వారికే ఎక్కువ ఉద్యోగాల్ని సొంతం చేసుకున్నట్లు గా వెల్లడించారు. గడిచిన మూడేళ్లలో ఈ కోర్సులకు విపరీతమైన ఆదరణ లభిస్తోందని పేర్కొంది. 2016 నుంచి 2019 మధ్య కాలంలో స్టెమ్ కోర్సులు చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు 44 వాతం పెరిగినట్లు గా పేర్కొన్నారు.

స్టెమ్ కోర్సులకు డిమాండ్ భారీ గా ఉండటమే కాదు.. నియామకాల వృద్ధి స్థిరంగా ఉన్నట్లుగా ఇండీడ్ వెబ్ సైట్ పేర్కొంది. స్టెమ్ కోర్సుల్ని పూర్తి చేసే విద్యార్థులకు మంచి ఫ్యూచర్ ఉన్నట్లుగా పేర్కొంది. ఇక.. మొత్తం స్టెమ్ ఉద్యోగాల్లో 31 శాతం ఢిల్లీలో వస్తే.. తర్వాతి స్థానం ముంబై నిలిచింది. ఈ నగరంలో 21 శాతం ఉద్యోగాలు పెరిగాయి. తర్వాతి స్థానాల్లో పుణె.. హైదరాబాద్.. చెన్నైలు నిలిచాయి. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే పశ్చిమ ప్రాంతాలు 34 శాతం ఉద్యోగాలతో అగ్రస్థానంలో నిలవగా.. దక్షిణాది రాష్ట్రాలు 31 శాతం ఉద్యోగాల్ని సొంతం చేసుకున్నాయని పేర్కొంది. అందరి కంటే తక్కువగా ఈశాన్య రాష్ట్రాలు కేవలం నాలుగు శాతానికే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. సో.. ఉద్యోగాలు సొంతం చేసుకోవాలంటే ఏ కోర్సులకు డిమాండ్ ఉందో అర్థమైందిగా?