Begin typing your search above and press return to search.

23 జిల్లాల తెలంగాణ ఇలా..

By:  Tupaki Desk   |   8 Jun 2016 11:17 AM GMT
23 జిల్లాల తెలంగాణ ఇలా..
X
సమైక్యాంధ్ర ప్రదేశ్ లో మొత్తం 23 జిల్లాలు ఉండేవి. రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తరువాత 10 జిల్లాలు తెలంగాణలో 13 జిల్లాలు ఏపీలోకి వచ్చాయి. అయితే.. తెలంగాణలో కొత్తగా మరికొన్ని జిల్లాలు ఏర్పాటు చేయడానికి దాదాపుగా కసరత్తు పూర్తయింది. తెలంగాణలో సమైక్య రాష్ర్టంలో ఉన్నట్లుగానే మొత్తం 23 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది. 30 జిల్లాలతో మరో ప్రతిపాదన తయారవుతోందన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ 23 జిల్లాలకు సంబంధించి కసరత్తు పూర్తయిందని తెలుస్తోంది. దాని ప్రకారం ప్రస్తుతం ఉన్న 459తో పాటు కొత్తగా 74 మండలాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం 44తో పాటు కొత్తగా 9 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి.

23 జిల్లాల జనాభా - వైశాల్యం - మండలాల వివరాలిలా ఉన్నాయి.

ఆచార్య జయశంకర్‌ జిల్లా – 8,56,453 మంది జనాభా ఉండగా - వైశాల్యం 6,760 చ.కి.మీటర్లు - 21 మండలాలు - 3 రెవెన్యూ డివిజన్లు.

ఆదిలాబాద్‌ – 14,22,034 మంది జనాభా ఉండగా - 7,673 చ.కిమీ వైశాల్యం, 27 మండలాలు - 4 రెవెన్యూ డివిజన్లు.

భద్రాద్రి -11,93,807 మంది జనాభా - 8,297 చ.కి.మీ వైశాల్యం - 23 మండలాలు.

యాదాద్రి – 7,19,131 మంది జనాభా - 2,956 చ.కి.మీ వైశాల్యం - 17 మండలాలు.

హైదరాబాద్‌ -39,01,928 మంది జనాభా - 1,914 చ.కి.మీ వైశాల్యం - 20 మండలాలు.

జగిత్యాల – 10,43,000 మంది జనాభా - 3,087 చ.కి.మీ వైశాల్యం - 18 మండలాలు.

కామారెడ్డి – 10,68,773 మంది జనాభా - 4,025 చ.కి.మీ వైశాల్యం - 21 మండలాలు.

కరీంనగర్‌ – 18,02,038 మంది జనాభా - 4,308 చ.కి.మీ వైశాల్యం - 26 మండలాలు.

ఖమ్మం – 18,80,137 జనాభా - 4,360 చ.కి.మీ వైశాల్యం - 22 మండలాలు.

కొమరంభీమ్‌ -13,19,205 మంది జనాభా - 8,442 చ .కి.మీ వైశాల్యం - 27 మండలాలు.

మహబూబాబాద్‌- 8,04,136 మంది జనాభా - 3,633 చ.కి.మీ వైశాల్యం - 15 మండలాలు.

మహబూబ్‌నగర్‌ – 18,67,620 మంది జనాభా - 6,518 చ.కి.మీ వైశాల్యం - 31 మండలాలు.

మెదక్‌ – 14,44,955 మంది జనాభా - 4,215 చ.కి.మీ వైశాల్యం - 25 మండలాలు.

నాగర్‌ కర్నూలు – 10,48,425 మంది జనాభా - 7,447 చ.కి.మీ వైశాల్యం - 22 మండలాలు.

నల్గొండ – 15,55,992 మంది జనాభా - 7,475 చ.కి.మీ వైశాల్యం - 32 మండలాలు.

నిజామాబాద్‌ – 14,47,961 మంది జనాభా - 3,772 చ.కి.మీ వైశాల్యం - 25 మండలాలు.

రంగారెడ్డి – 10,86,522 మంది జనాభా - 4,157 చ.కి.మీ వైశాల్యం - 20 మండలాలు.

సంగారెడ్డి – 11,86,280 మంది జనాభా - 3,116 చ.కి.మీ వైశాల్యం - 18 మండలాలు.

సికింద్రాబాద్‌ – 42,51,614 మంది జనాభా - 1,608 చ.కి.మీ వైశాల్యం - 23 మండలాలు.

సిద్ధిపేట – 11,90,209 మంది జనాభా - 4,398 చ.కి.మీ వైశాల్యం - 22 మండలాలు.

సూర్యాపేట – 13,86,883 మంది జనాభా - 4,348చ.కి.మీ వైశాల్యం - 25 మండలాలు.

వనపర్తి – 11,36,983 మంది జనాభా - 4,426 చ.కి.మీ వైశాల్యం - 22 మండలాలు.

వరంగల్‌ – 22,36,051 మంది జనాభా - 4,883 చ.కి.మీ వైశాల్యం - 31 మండలాలు.