Begin typing your search above and press return to search.
బ్రిటన్ లో 23వేల మంది టెర్రరిస్టులు
By: Tupaki Desk | 28 May 2017 12:26 PM GMTఉగ్రవాదుల గురించి షాక్ కు గురిచేసే వార్త వెలువడింది. బ్రిటన్‌లో భారీ స్థాయిలో ఉగ్రవాదులు ఉన్నట్లు తేలింది. అది కూడా వందలు వేలల్లో కాకుండా...ఏకంగా మొత్తం 23 వేల మంది ఉగ్రవాదులు ఉన్నట్లు బ్రిటన్ గూడచార వర్గాలు అంచనా వేశాయి. వీళ్లలో 3 వేల మందితో దేశానికి ముప్పు పొంచి ఉందని నిఘావర్గాలు స్పష్టం చేశాయి.మాంచెస్టర్ సంగీత కచేరీ పై ఆత్మాహుతి దాడి కేసు అనంతరం బ్రిటన్ భద్రతాధికారులకు సవాళ్లు మరింత పెరిగాయి.దీంతో నిఘావర్గాలు దేశంలోని భద్రత పరిస్థితి - అవాంచనీయ శక్తుల గురించి ఆరాతీయగా ఈ షాకింగ్ లెక్కలు తేలాయి.
పాప్ సింగర్ అరియానా గ్రాండే మాంచెస్టర్ లో కన్సర్ట్ నిర్వహిస్తుండగా దాడి జరిగిన ఘటనలో 29 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా..అత్మాహుతి దాడికి పాల్పడింది 22 ఏళ్ల సల్మాన్ అబేదీయేనని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు అనుమానితులను అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం అబేదీ ఓ సూట్ కేసులో పేలుడు పదార్థాలు అమర్చి స్టేడియం గేట్ వద్ద పేల్చి వేసుకున్నాడని గుర్తించారు. పేలుడు పదార్థాలను ఇంట్లోనే తయారు చేసుకున్నాడని అనుమానిస్తున్నారు. అనంతరం నగరంలోని మోస్ సైడ్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు జరిపారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన సల్మాన్ అబేదీకి ఐఎస్ తో గల సంబంధాలపై దృష్టి సారించినట్లు తెలిపారు.
లిబియాలో ఉన్న సల్మాన్ అబేదీ తండ్రి రమదాన్ అబేదీ - సోదరులు హషీం - ఇస్మాయిల్ ను కూడా అరెస్ట్ చేశామని పోలీసులు వివరించారు. తనతోపాటు తన సోదరుడు సల్మాన్ దాడికి పాల్పడినట్టు విచారణలో ఇస్మాయిల్ అబేది తెలిపారు. వీరంతా ఐఎస్ సభ్యులని, దాడికి సంబంధించిన అన్ని వివరాలు వీరికి తెలుసునని పోలీసులు చెప్పారు. 1993లో నాటి లిబియా అధినేత గడాఫీ ప్రభుత్వం అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ట్రిపోలి నుంచి బ్రిటన్ కు పారిపోయిన రమదాన్ అబేదీ.. 2011 అంతర్యుద్ధంలో గడాఫీకి ఉద్వాసన పలికిన తర్వాత తిరిగి ట్రిపోలీ చేరుకున్నాడు. ప్రస్తుతం రమదాన్ అబేదీ ట్రిపోలీ కేంద్ర భద్రతా సంస్థ మేనేజర్‌గా ఉన్నాడు. ఆత్మాహుతి దాడి చేసిన సల్మాన్ అబేదీ.. దక్షిణ మాంచెస్టర్ సిటీలో ఉంటూ యువకులను ఉగ్రవాదంవైపు ప్రేరేపించినట్టు ఇంతకుముందు ఒక టీవీ చానెల్ వార్తాకథనం ప్రసారంచేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/