Begin typing your search above and press return to search.

అమెరికాలో మగ్గుతున్న ఇండియన్స్ ఎక్కువే..

By:  Tupaki Desk   |   14 Nov 2018 6:41 AM
అమెరికాలో మగ్గుతున్న ఇండియన్స్ ఎక్కువే..
X
అమెరికా అధ్య‌క్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్ అధికారం చేపట్టాక పాలనలో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేపడుతున్నారు. అవికాస్తా విమర్శల పాలవుతూ ఇంటా బయటా అభాసుపాలవుతున్నారు. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేశారు. అక్రమ ప్రవేశం పేరుతో అరెస్టు చేసి జైళ్లలో మగ్గుతున్న భారతీయుల సంఖ్య కొంచెం ఎక్కువగా నే ఉంది.

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వలస విధానంపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ విషయంపై కొన్ని రోజులుగా పెను దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఇమ్మిగ్రేషన్ చట్టాలను పటిష్టంగా అమలు చేయడంతో పాటు .వంద‌లాది మందిని అరెస్టులు చేస్తున్నారు. వివిధ దేశాల నుంచి అక్రమంగా వెళ్లిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరిలో ఇండియన్స్ సంఖ్య కాస్తా ఎక్కువగా ఉంది. దాదాపు 2382 మంది భారతీయులు ఉన్నారని తేలింది. సరిహద్దులు దాటి అమెరికాలోకి ప్రవేశించారనే కారణంతో వీరంతా అమెరికా జైళ్లలో ఉన్నారు.

అమెరికాలో 86 జైళ్లలో 2,382 మంది భారతీయులు ఉన్నట్లు అమెరికా సమాచార హక్కు చట్టం ద్వారా నార్త్‌ అమెరికన్‌ పంజాబీ అసోసియేషన్‌(ఎన్ ఏపీఏ) వెల్లడించింది. సదరు నివేదిక ప్రకారం ఆశ్రయం కోరుతూ అక్రమంగా సరిహద్దులు దాటినట్లు తెలిపింది. వీరిలో ఎక్కువ మంది పంజాబ్‌ నుంచి వలస వెళ్లిన వారు ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. పంజాబ్‌లో హింసాత్మక పరిస్థితుల కారణంగా ఆశ్రయం కోరుతూ అమెరికా వచ్చినట్లు తెలిపారని నివేదిక తెలిపింది.

కాగా, అమెరికాలో అక్రమంగా ఉంటున్నారనే అభియోగంపై 2015లో 900 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఫెడరల్ జైళ్లలో ఉంచారు. మానవ అక్రమ రవాణాదారులకు - అధికారులు - రాజకీయ నేతల మధ్య ఉన్న చట్టవ్యతిరేక సంబంధాల వల్ల పంజాబీ యువకులు భారత్‌ను వదిలి అమెరికాకు వస్తున్నారని ఉత్తర అమెరికా పంజాబీ సంఘం ప్రతినిధి సత్నామ్ సింగ్ చౌహాల్ తెలిపారు. వీరు ఒక్కొక్కరు రూ.35 నుంచి రూ.40 లక్షలు చెల్లించి అమెరికాకు వస్తున్నారన్నారు. మానవ అక్రమ రవాణాకు పంజాబ్‌ కు చెందిన వారు బలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.