Begin typing your search above and press return to search.

దిన‌క‌ర‌న్ గూటికి 24 మంది ఎమ్మెల్యేలు

By:  Tupaki Desk   |   7 Jun 2017 1:21 PM GMT
దిన‌క‌ర‌న్ గూటికి 24 మంది ఎమ్మెల్యేలు
X
త‌మిళ‌నాట రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. బెయిల్‌ పై విడుద‌లైన దిన‌క‌ర‌న్ కు 24 మంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తు తెలిపారు. దీంతో, ప‌ళ‌ని స్వామి వ‌ర్గంలోని ఎమ్మెల్యేల సంఖ్య 99కి చేరింది. ఈ ప‌రిణామంతో ప‌ళ‌ని స్వామి ప్ర‌భుత్వం అసెంబ్లీ స‌మావేశాల‌కు ముందే కూలిపోనుంద‌ని ప్ర‌తిప‌క్ష నేత స్టాలిన్ అంచ‌నా వేస్తున్నారు.

అన్నాడీఎంకే నుంచి దిన‌క‌ర‌న్‌ ను దూరం చేసేందుకు పళనిస్వామి వర్గం ప్రయత్నిస్తుండగా నానాటికీ ఆయ‌న‌ బ‌లం పెరుగుతుండటం గమనార్హం. ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వ‌బోయిన కేసులో అరెస్టైన దినకరన్‌ ఇటీవల బెయిల్‌ పై విడుదల‌య్యారు. అనంతరం జైలులో ఉన్న శశికళను కలిసిన స‌మ‌యంలో 4 ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు పలికారు. మంగళవారం రాత్రికి ఆ సంఖ్య 24కు చేరింది. రోజురోజుకు మన్నార్‌ గుడి మాఫియాకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య పెరగ‌డంతో దిన‌క‌ర‌న్ వేగంగా పావులు క‌దుపుతున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత్రి చిన్న‌మ్మేనని, పార్టీ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీగా తానే పార్టీని నడుపుతానని తెలిపారు.

తాజా ప‌రిణామాల‌తో ప‌ళ‌ని స్వామి వ‌ర్గం క‌ల‌త చెందుతోంది. జంప్ జిలానీల సంఖ్య పెరిగితే అన్నాడీఎంకేను దిన‌క‌ర‌న్ పూర్తిగా హ‌స్త‌గ‌తం చేసుకునే అవ‌కాశ‌ముంద‌ని ఆయ‌న వర్గం భావిస్తోంది. దిన‌క‌ర‌న్‌ వైపు ఎమ్మెల్యేలు వెళ్ల‌కుండా ఉండేందుకు ప‌ళ‌ని స్వామి చేస్తున్న ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/