Begin typing your search above and press return to search.
పాతిక రోజులు కేసీఆర్ చేతులు కట్టేసినట్లే!
By: Tupaki Desk | 13 July 2019 5:01 AM GMTస్థాయి పెరిగిన కొద్దీ.. కింద పని చేసే సిబ్బంది పెరుగుతారు. పనులు.. ఒత్తిళ్లు అంతకంతకూ పెరుగుతాయి. అలాంటివేళలో కొంతమంది మీద ఆధారపడటం ఖాయం. అలా ఆధారపడినోళ్లు చేతి కింద లేకుండా వెళితే ఎంత ఇబ్బంది? ఇప్పుడు సరిగ్గా అలాంటి ఇబ్బందే ఎదుర్కొనున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తన రోజువారీ కార్యకలాపాలకు సంబంధించి కీలకంగా వ్యవహరించే పలువురు ఐఏఎస్ అధికారుల్ని మధ్యంతర శిక్షణ కోసం ఆహ్వానం అందింది.
తమ సర్వీసు మధ్యలో ఐఏఎస్ లు తప్పనిసరిగా తీసుకోవాల్సిన శిక్షణకు సంబంధించి డీవోపీటీ ఆహ్వానం పంపింది. దాదాపు పాతిక రోజుల పాటు సాగే ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తెలంగాణకు చెందిన పలువురు ఐఏఎస్ లకు ఆహ్వానాలు అందాయి. సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 18 వరకు ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఆడ్మినిస్ట్రేటివ్ అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ శిక్షణ కోసం తెలంగాణకు సంబంధించిన పలువురు ఐఏఎస్ లు ఉన్నారు. వీరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు పని చేసే వారు పలువురు ఉన్నారు. వీరంతా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన పలు వ్యవహారాల్ని నిత్యం చేసే వారే కావటం గమనార్హం. ఉన్నట్లుండి తన టీంలోని ముఖ్యులు శిక్షణ కోసం వెళితే.. కేసీఆర్ కాళ్లు.. చేతులు ఆడవని చెప్పక తప్పదు. ఇంతకీ.. శిక్షణ కోసం పిలుపు వచ్చిన వారి పేర్లను చూస్తే.. సారుకు ఎంత ఇబ్బందో ఇట్టే అర్థమవుతుంది.
మధ్యంతర శిక్షణకు పిలుపు వచ్చిన వారి జాబితాలో..
+ సీఎంవో కార్యదర్శి సందీప్ కుమార్త సుల్తానియా
+ సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్
+ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె. రామకృష్ణారావు
+ వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా
+ సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్
+ పంచాయితీ రాజ్ కమిషనర్ నీతు కుమారి
+ రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి జ్యోతిబుద్ధ ప్రకాష్
+ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ యోగితా రాణా
+ బీసీ సంక్షేమ డైరెక్టర్ అనితా రాజేంద్ర
+ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేశ్ కుమార్
+ పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి
+ సీనియర్ ఐఏఎస్ అధికారులు శైలజా రామయ్యర్.. ఎన్. రఘునందన్ రావు