Begin typing your search above and press return to search.
భారత్ భవిష్యత్ పై ధీమా...ఇదే తగిన సమయం: స్పెషల్ సర్వే!
By: Tupaki Desk | 21 April 2020 11:30 PM GMTకరోనా కారణంగా ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. ఈ మహమ్మారి వల్ల ప్రపంచ - దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడుతోంది. కోట్లాది ఉద్యోగాలు పోతాయనే ఆందోళన నెలకొంది. ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో వేతనాల కోత ఓ అంశమైతే - కరోనా తర్వాత కొన్ని రంగాల్లో ఉద్యోగాలపై ప్రభావం పడుతుంది నేది మరో అంశం. ఈ నేపథ్యంలో లింక్డిన్ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడైయ్యాయి. భారత వృత్తి నిపుణులు భవిష్యత్తుపై ధీమాగా ఉన్నట్లు తెలిపింది.
షార్ట్ టర్మ్ లో ఉద్యోగావకాశాలు - కంపెనీల ఆర్థిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసినట్లు లింక్డిన్ సర్వే నివేదిక తెలిపింది. ఈ నెల తొలి వారానికి భారత్ కు సంబంధించి లింక్డిన్ వర్క్ ఫోర్స్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ స్కోర్ 53గా నమోదయింది. భారత వృత్తి నిపుణుల్లో 50 శాతం మంది వచ్చే ఆరు నెలల్లో ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది తమ వృత్తి జీవితంలో ప్రగతి ఉంటుందని ప్రతి అయిదుమందిలో ముగ్గురు నిపుణులు చెప్పారు. రానున్న రెండేళ్లలో తమ కంపెనీలు తిరిగి పుంజుతుంటాయని 72 శాతం మంది చెప్పారు
అలాగే , రానున్న రెండు వారాల్లో ఉద్యోగాల కోసం వెతికే సమయం పెరుగుతుందని 42 శాతం మంది అభిప్రాయపడ్డారు. వచ్చే రెండు వారాలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నందున కొత్త అంశాలు నేర్చుకోవడానికి ఉపకరిస్తుందని 64 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆదాయం తగ్గిందని 25 శాతం మంది చెప్పగా, వ్యక్తిగత వ్యయం తగ్గినట్లు 42 శాతం - పెట్టుబడులు తగ్గినట్లు 31 శాతం మంది చెప్పారు. ఇదిలా ఉండగా సీనియర్ మేనేజ్ మెంట్ లో మాత్రం వచ్చే ఆరు నెలలు గడ్డుకాలమేనని 33 శాతం మంది చెప్పారు.వచ్చే రెండేళ్ల లో వృద్ధి పై 69 శాతం మంది ధీమాగా ఉన్నారు. లింక్డిన్ వర్క్ ఫోర్స్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ ఆన్ లైన్ సర్వే ద్వారా ఈ వివరాలు సేకరించింది.