Begin typing your search above and press return to search.
25 బిలియన్ డాలర్ల ఆస్తులున్న 25 ఏళ్ల యువతి ఎవరంటే ..?
By: Tupaki Desk | 11 Jun 2021 12:30 AM GMTజెన్నిఫర్ గేట్స్ .. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ , భార్య మెలిండా గేట్స్ ముద్దుల తనయ. ఈ ఇద్దరూ ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ ఇద్దరి ముద్దుల తనయ గురించి పెద్ద చర్చ జరిగింది. పాతికేళ్లకే లక్షల కోట్లకు అధినాయకురాలు , ఏకంగా లక్షా 82వేల కోట్ల రూపాయల ఆస్తి ఆమె సొంతం. త్వరలోనే పెళ్లికి సిద్ధం అవుతుంది. ఇక తన పేరెంట్స్ విడాకుల ప్రకటనపై స్పందించిన జెన్నిఫర్..ఈ సమయంలో నాతోపాటు కుటుంబంలో అందరి మానసిక పరిస్థితి, భావోద్వేగాలకు ఎలా అండగా నిలబడాలో ఇంకా నేర్చుకుంటున్నా. ఇలా చేయడానికి నాకంటూ కొంత స్పేస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని ట్వీట్ చేసింది.
జెన్నిఫర్ గేట్స్ నికర విలువ ఎంతో తెలుసా, ఏకంగా 25 బిలియన్ డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు లక్షా 82వేల కోట్లు. బడా వ్యాపారవేత్తలకో, పెద్ద పెద్ద సెలబ్రెటీలకో ఇంత మొత్తంలో ఆస్తి ఉండటం చాలా అరుదు. కానీ అలాంటిది జెన్నిఫర్ మాత్రం పాతికేళ్లకే అంత నెట్ వర్త్ ను సంపాదించేసింది. కాకపోతే తండ్రి మైక్రాసాఫ్ట్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైనప్పుడు మరి కుమార్తెకు కూడా ఈ మాత్రం నెట్ వర్త్ ఉంటుంది. ఇంతకీ బిల్ గేట్స్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా ఏకంగా 130 బిలియన్ డాలర్లు. ఇంత పెద్ద మొత్తంలో ఆస్తిపాస్తులను కలిగిన జెన్నీఫర్ వ్యక్తిగత వివరాల గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. సియాటెల్ లోని లేక్ సైడ్ హై స్కూల్లో చదువుకున్న జెన్నిఫర్.. ఆ తర్వాత స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లింది.
2018లో అక్కడి నుంచి మానవ జీవశాస్త్రం సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది. ఆ తర్వాత తనకు ఇష్టమైన ఇక్వస్ట్రియన్ గా మారడానికి శిక్షణ తీసుకోవడం కోసం ఏడాది పాటు చదువుకు బ్రేక్ ఇచ్చింది. ఆపై మౌంట్ సినాయ్ లోని మెడిసిన్ స్కూల్ కు వెళ్తోంది. ప్రస్తుతం ఇక్కడ సెకండ్ ఇయర్ చదువుతోంది. గుర్రపు స్వారీ చేయడంలో జెన్నీఫర్ చాలా టాలెంటెడ్. ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఆమె గుర్రపు స్వారీ చేస్తూన ఉంది. ఆమె ఫేవరెట్ గుర్రం పేరు అలెక్స్. గుర్రపు స్వారీతోపాటు ప్రయాణాలన్నా కూడా జెన్నిఫర్ కు చాలా ఇష్టం. ఆమె ఇన్ స్టాగ్రామ్ ఫొటోల్లు అత్యధికం తన పర్యటనలకు సంబంధించినవే ఉంటాయి. నాయల్ నాజర్.. ఈజిప్టుకు చెందిన ఈయన మరో ఇక్వస్టియన్, షో జంపర్. షో జంపింగ్ అనేది ఒక ఒలింపిక్ క్రీడ. గుర్రాలు హర్డిల్ జంప్ చేసే బృంద క్రీడ ఇది. ప్రొఫెషనల్ షో జంపర్ అయిన నాజర్ గురించి అంతకుముందు కేవలం ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారికే తెలుసు.
కానీ జెన్నిఫర్‌తో నిశ్చితార్థం చేసుకోవడంతో నాజర్ ప్రపంచవ్యాప్తంగా సెలెబ్రిటీ అయిపోయారు. వీరిద్దరూ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలోనే చదువుకున్నారు. ఈ నిశ్చితార్థం సమయంలో మన మిగతా జీవితాలను నేర్చుకుంటూ, ఎదుగుతూ, నవ్వుతూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ జీవించడానికి ఎదురు చూస్తున్నా అని ఇన్ స్టాగ్రామ్‌లో జెన్నిఫర్ ఒక పోస్టు పెట్టింది. ఎంగేజ్ మెంట్ తర్వాతి నుంచి ఈస్ట్ కోస్ట్ ప్రాంతంతో కలిసి జీవిస్తున్న ఈ జంటకు ఒకరిపై మరొకరికి ఎనలేని ప్రేమ. జెన్నిఫర్ ఇన్ స్టాగ్రామ్ చూస్తేనే ఈ విషయం తేటతెల్లమైపోతుంది. ఎందుకంటే ఆమె ఇన్ స్టాలో ఎక్కువ శాతం ఫొటోలూ ఈ జంట అన్యోన్యంగా ఉన్నవే. అలాగే ఏర్పాటు చేసి నిర్వహించేంది జెన్నిఫరే. దానాలు చేయడంలో జెన్నిఫర్, తన తల్లిదండ్రులను ఫాలో అవుతోంది.