Begin typing your search above and press return to search.
ట్రోలింగ్: బాబు వెన్నుపోటుకు 25 ఏళ్లు?
By: Tupaki Desk | 25 Aug 2020 5:30 PM GMTఅందరూ మరిచిపోయిన ఉదంతం.. చంద్రబాబును వదల బొమ్మాళి అంటూ వెంటాడుతూనే ఉంది. 25 ఏళ్ల కిందటి సంగతి.. నాడు బలమైన మీడియా ఇప్పటికీ ఉంది. కానీ ఆ మీడియా కూడా నోరు మెదపడం లేదు. మెజార్టీ టీడీపీ మీడియానే ఉండడంతో దీనిపై కిక్కురుమనడం లేదు. కానీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం.. కొందరు బాబు అంటే పడని జర్నలిస్టులు ఇప్పుడు పాత జ్ఞాపకాలను మళ్లీ తవ్వుతున్నారు. దీంతో చంద్రబాబు పాపం... సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురి అవుతున్నారు.
1996 ఆగస్టు 23న ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసి.. ఎన్టీఆర్ ను పార్టీ నుంచి బహిష్కరించి ఇదే చంద్రబాబు పార్టీని హస్తగతం చేసుకొని సీఎం అయ్యాడు. నాడు వైస్రాయ్ హోటల్ కేంద్రంగా చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా, చివరకు హరికృష్ణ - దగ్గుబాటి అందరూ కలిసి ఎన్టీఆర్ ను దించేశారన్నది ప్రధాన ఆరోపణ.. లక్ష్మీపార్వతిదే అంతా జరుగుతోందని ఈ చర్య చేపట్టారు.
అయితే ఈ రోజును అందరూ మరిచిపోయినా వైసీపీ నేతలు - కొందరు జర్నలిస్టులు మరిచిపోలేదు. సోషల్ మీడియాలో బాబు వ్యతిరేకులు ఇప్పుడు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ‘బాబు వెన్నుపోటుకు 25 ఏళ్లు’ అంటూ తెగ వైరల్ చేస్తున్నారు.
తాజాగా లక్ష్మీపార్వతి దీనిపై మాట్లాడుతూ ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి 25 ఏళ్లు గడిచాయని విమర్శించారు. ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ట్విట్టర్ లో ఎండగట్టారు. ‘25 సంవత్సరాల క్రితం ఇదే రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్తాపకులు ఎన్టీఆర్ గారిని చంద్రబాబు వెన్నుపోటు పొడిచి - పార్టీ నుంచి ఆయన్ని బహిష్కరించి - పార్టీ పగ్గాలు లాక్కుని - ఎన్టీఆర్ గారిని అవమానించారు. ఇప్పటి కైనా ఎన్టీఆర్ గారి మీద సస్పెన్షన్ ఎత్తేస్తారేమో చూడాలి.’ అంటూ ఎద్దేవా చేశారు.
‘‘గొప్ప నాయకుడు టిడిపి వ్యవస్థాపకుడు ఎన్ టి రామారావు గారిని పార్టీ నుండి 25 సంవత్సరాల క్రితం బహిష్కరించారు.ఇదే రోజున ఆ పనిచేసిన చంద్రబాబు.. తరువాత బిజెపి & మోడీ జిని కూడా అపవాదు చేశారు ”అని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ ధియోధర్ కూడా విమర్శించారు.
ఇలా 25 ఏళ్ల కిందట టీడీపీలో జరిగిన సంక్షోభాన్ని చంద్రబాబు ప్రత్యర్థులంతా గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ బాబుపై ప్రతీకారం తీర్చేసుకుంటున్నారన్న ఆవేదన టీడీపీ వర్గాల్లో సాగుతోందట..