Begin typing your search above and press return to search.
కేసీఆర్ బాకీ 2500 కోట్లా?
By: Tupaki Desk | 13 April 2016 7:35 AM GMTతెలంగాణ గవర్నమెంటు నుంచి రావాల్సిన బకాయిలు వసూలు చేయాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబు తన అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని విద్యుత్ సంస్థల విభజన తరువాత, తెలంగాణ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ. 2,500 కోట్లను వసూలు చేయడంతో పాటు, రూ. 1000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను పరిరక్షించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. బకాయిల వసూళ్లకు చర్యలు చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రిని కలిసి విన్నవించగా, ఆయన స్పందించారు. ఆస్తుల విభజన కూడా ఉద్యోగుల విభజన జరిగిన నిష్పత్తిలోనే సక్రమంగా జరిగేలా చూడాలని, అందుకు ఓ సంయుక్త కమిటీని నియమించాల్సి వుందని కూడా సంఘం నేతలు సూచించారు. వారితో చర్చించిన చంద్రబాబు - ఉద్యోగులు - ఆస్తుల విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
కాగా పదో షెడ్యూలు పలు సంస్థల మధ్య ఆస్తుల పంపకం లెక్కలు తేలలేదు. వీటిలోని పలు సంస్థలకు సంబంధించి కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు విద్యుత్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వసూలుకు ఒత్తిడి చేయడం చర్చనీయాంశంగా మారింది. మళ్లీ రెండు రాష్టాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయా అన్న చర్చ జరుగుతోంది.