Begin typing your search above and press return to search.

ఏపీలో మాస్క్ లేకుండా తిరిగారా? మీ జేబుకు భారీ చిల్లు?

By:  Tupaki Desk   |   1 Aug 2021 4:37 AM GMT
ఏపీలో మాస్క్ లేకుండా తిరిగారా? మీ జేబుకు భారీ చిల్లు?
X
ఏపీ ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయతలపెట్టింది. నిబంధనల్ని మరింతగా కఠినం చేయాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ముఖ్యంగా మాస్క్ లేకుండా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరిక జారీ చేసింది.

కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి మాస్కులు లేని వారిని అనుమతిస్తే రూ.10వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

జరిమానా మొత్తాన్ని స్తానిక పరిస్థితుల ఆధారంగా ఖరారు చేస్తామని.. అదే విధంగా 2-3 రోజుల పాటు సంబంధిత సంస్థలను మూసివేసేలా అధికారులు చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.

ఇక ఏపీలో కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు గుర్తించి తమకు ఆ ఫొటోలు పంపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం ఇందుకోసం ఒక వాట్సాప్ నంబర్ ను కూడా ప్రవేశపెట్టింది. వాట్సాప్ చేయాలనుకునేవారు '8010968295' నంబర్ కు వాట్సాప్ చేయాలని కోరారు.

ఇక కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు వారాల పాటు రాత్రి వేళ కర్ఫ్యూను పొడిగించినట్టు తెలిపారు. ఆగస్టు 14వ తేదీ వరకు కర్ఫ్యూ ఆంక్షలు ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని తెలిపారు.

అందరూ కోవిడ్ ప్రొటోకాల్ ను తప్పనిసరిగా పాటించాలని.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. మాస్క్ లు ధరించని వారికి రూ.100 జరిమానా విధించే అధికారాన్ని ఎస్ఐ ఆపై పోలీసులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.