Begin typing your search above and press return to search.
మద్యం తాగితే కరోనా రాదని ఫుల్ గా తాగి 27 మంది మృతి !
By: Tupaki Desk | 10 March 2020 6:17 AM GMTచైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్, అక్కడి నుండి ఒక్కో దేశానికీ వ్యాప్తి చెందుతూ ప్రస్తుతం 100 దేశాలకి పాకింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 4 వేల 9కి చేరింది. లక్షా 14 వేల 285 మంది కరోనా బాధితులు ఉన్నారు. 6 వేల 88 మందికి సీరియస్ గా ఉంది. ఇకపోతే ఈ కరోనా వైరస్ పై రూమర్స్ కూడా ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తోన్న విభిన్న వార్తలతో ఏది నిజమో ..ఏది అబద్దమో తెలియక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి వందుతుల వల్ల కొందరు ప్రాణాలని కూడా కోల్పోతున్నారు.
తాజాగా ఇటలీలో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. మద్యంతో కరోనా నయమవుతుందంటూ ప్రచారం జరిగింది. ఇది నిజమే అని నమ్మి ఖుజెస్తాన్, అల్బోర్జ్ లో నాటుసారా తాగి 27 మంది మృతి చెందారు. 218 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ కరోనా వైరస్ ప్రభావం చైనాలో తగ్గి ఇతర దేశాల్లో పెరుగుతోంది. ఇటలీలో దాదాపు ఏడు వేల మందికి ఈ వైరస్ సోకింది. కరోనా ప్రభావంతో ఈ సోమవారం ఒక్కరోజే అక్కడ 43 మంది ప్రాణాలు విడిచారు. అలాగే భారత్ లో ఇప్పటివరకు మొత్తం 45 కరోనా కేసులు నమోదయ్యాయి కరోనా వేగంగా వ్యాప్తి చెందడంతో ప్రజలకు భయం పట్టుకుంది. అందుకే ఎవరు ఏది చెప్పినా నమ్మి..భిన్న పద్దతులు ఫాలో అవుతున్నారు. అయితే , వైద్యులు మాత్రం కరోనా కి ఇంకా ఎటువంటి మందు లేదు అని , కరోనా రాకుండా పలు జాగ్రత్తలు పాటించాలని , సోషల్ మీడియా లో వచ్చే వదంతులని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి అని హెచ్చరిస్తున్నారు.