Begin typing your search above and press return to search.

జగన్ టేబుల్ మీద 27మంది ఎమ్మెల్యేల అవినీతి చిట్టా.!?

By:  Tupaki Desk   |   4 July 2019 3:58 AM GMT
జగన్ టేబుల్ మీద 27మంది ఎమ్మెల్యేల అవినీతి చిట్టా.!?
X
అవినీతి పాలన అందించడానికి జగన్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. రివర్స్ టెండరింగ్ తోపాటు జ్యూడిషియల్ కమిషన్ వేసి ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా ప్రాజెక్టులు - వివిధ పనులకు టెండర్ల ద్వారా ముందుకెళుతున్నారు. అంతేకాదు గడిచిన టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికితీస్తున్నారు. టీడీపీ అమరావతి రాజధాని భూముల కుంభోకణం సహా అక్రమ కట్టడాల కూల్చివేతతో ప్రజల్లో మంచి పేరు సమర్థుడైన నాయకుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. అయితే పార్వ్యానికి ఇది ఒకవైపు మాత్రమే.

పదేళ్లు అధికారానికి దూరంగా ఉండి జగన్ పోరాడారు. ఆయనతోపాటు ఉన్న ఎమ్మెల్యేలు సైతం అధికారానికి దూరంగా పదేళ్లు అష్టకష్టాలు పడ్డారు. ఈ ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టుకొని గెలిచారు. గెలిచాక ఆర్థిక ఇబ్బందులు సహజం. పైగా అధికారం.. అందుకే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అప్పుడే అవినీతిని మొదలు పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి... ఆయా నియోజకవర్గాల్లో వివిధ పనులు - ప్రభుత్వ ఆస్తులు - ఇతర మైనింగ్ లలో హస్తవాసి చూపుతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి.

అలా వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే అవినీతి మొదలు పెట్టిన 27మంది వైసీపీ ఎమ్మెల్యే అవినీతి చిట్టా జగన్ టేబుల్ మీదకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. జగన్ ఎంతో సదాశయంతో కష్టపడి అవినీతి రహితంగా పనిచేస్తుంటే సదురు ఎమ్మెల్యేల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఇంటెలిజెన్స్ రిపోర్టులు జగన్ కు చేరినట్టు సమాచారం. అవినీతి చేస్తే సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా వదలనని జగన్ హెచ్చరించిన నేపథ్యంలో ఆ 27మందిపై ఇప్పుడు ఎలాంటి చర్య తీసుకుంటారన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో సాగుతోంది.