Begin typing your search above and press return to search.
కరోనా వైరస్ కి మూలం అదేనా .. 2,715 మంది మృతి ..
By: Tupaki Desk | 26 Feb 2020 10:30 AM GMTకరోనా వైరస్ .. చైనా లోని వూహన్ లో పుట్టిన ఈ వైరస్ రోజురోజుకి మరింతగా విజృంభిస్తూ దాదాపుగా 25 దేశాలకి విస్తరించింది. ఇప్పటి వరకు ఈ కరోనా వైరస్ తో మరణించిన వారి సంఖ్య 2,715 . అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌తో దాదాపు లక్షమంది వరకు బాధపడుతున్నారు. వీరిలో దాదాపుగా 95 శాతం మంది చైనీయులే. ఈ వైరస్ బయటకి వచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా ఈ వైరస్ కి సంబంధించిన సరైన మందు కనిపెట్టలేకపోవడంతో మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంది.
అయితే, కరోనా వైరస్ ములాలు చైనాలోని ఒక ప్రయోగశాలలోనే ఉన్నాయా? అనుమానాలు వ్యక్తం అవుతున్న ఈ సమయంలో ‘ద పాజిబుల్ ఆరిజన్స్ ఆఫ్ 2019-ఎన్‌సీవోవీ కరోనా వైరస్’ పేరుతో వెలువడిన ఓ వ్యాసం ఆ ప్రశ్నకి అవుననే సమాధానం చెబుతోంది. దక్షిణ చైనాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నిపుణులు ఈ వ్యాసాన్ని రాశారు. దాని ప్రకారం.. చైనాలోని ‘వూహాన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ లో గబ్బిలాలపై కొంతకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయని, వైరస్ కు కేంద్రస్థానంగా భావిస్తున్న వూహాన్ లోని సీఫుడ్ మార్కెట్‌కు ఇది కేవలం 300 గజాల దూరంలో ఉంది.
ఒకరోజు ఆ ప్రయోగ కేంద్రంలోని గబ్బిలాలు అక్కడున్న పరిశోధకుడిపై దాడి చేసినట్టు తెలిపారు. అలాగే వాటి రక్తం అతడి చర్మంపై పడిందని, వాటి మూత్రం కూడా అతడిపై పడినట్టు వెల్లడించారు. దీంతో సదరు వ్యక్తి రెండువారాలపాటు స్వయంగా క్వారంటైన్ లో ఉన్నాడని , దీంతో.. ఇక్కడి నుంచి కరోనా వైరస్ చిన్నగా వ్యాప్తి చెందటం మొదలైంది అని అనుమానిస్తుండగా, దీనికి ఇప్పుడు మరింత బలం చేకూరినట్టు అయ్యింది.