Begin typing your search above and press return to search.
కరోనా భయం: ఇరాన్ నుంచి భారత్ చేరిన 275మంది
By: Tupaki Desk | 29 March 2020 7:39 AM GMTచైనా తర్వాత కరోనా వైరస్ విజృంభించింది ఇటలీ - ఇరాన్ దేశాల్లోనే.. ఇరాన్ లో వందలాది మరణించారు. ఇటీవల ఇరాన్ దేశంలో సోషల్ మీడియాలో ‘మెథానల్ ’ను కరోనా మందు అని ప్రచారం సాగడంతో దాన్ని తాగి ఏకంగా 1000 మంది ఒక్కరోజులోనే ప్రాణాలు కోల్పోయారు. అంతటి దుర్భర కరోనా దేశం నుంచి దాదాపు 275మంది భారతీయులను భారత్ కు రప్పించారు.
ఇరాన్ లో చిక్కుకున్న 275మంది భారతీయులను ఈ ఉదయం ప్రత్యేక విమానంలో రాజస్థాన్ లోని జోధ్ పూర్ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇరాన్ లో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ అక్కడ చిక్కుకున్న భారతీయులు భారత ప్రభుత్వాన్ని తమను కాపాడాలని మొర పెట్టుకున్నారు. దీంతో భారత ప్రభుత్వం ప్రత్యేక విమానం పంపించి తీసుకొచ్చింది.
అయితే కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో వీరందరినీ కొన్ని రోజుల పాటు ఆర్మీ క్యాంపుల్లో క్వారంటైన్ లో ఉంచుతారు. ఈ మేరకు ఎవరికైనా కరోనా లక్షణాలు బయటపడితే చికిత్స నందిస్తారు. పూర్తిగా 14 రోజుల తర్వాతే వీరందరినీ బయటకు పంపిస్తారు.