Begin typing your search above and press return to search.
తెరపైకి 27వ జిల్లా.. జగన్ ఏమంటారో?
By: Tupaki Desk | 8 Feb 2022 10:30 AM GMTకొత్త జిల్లాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ మీద పెద్ద ఎత్తున మార్పులు.. చేర్పుల కోసం డిమాండ్లు.. వినతులు పెరుగుతున్నాయి. కొత్త జిల్లాల ప్రకటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం.. ప్రజలను మార్పులు ఏమైనా ఉంటే చెప్పాలని కోరింది. అయితే.. ప్రజల నుంచి వస్తున్న వినతులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. కొత్త జిల్లాలకు సంబంధించి వైఎస్ జగన్ మొదట్నించి చాలా స్పష్టతతో ఉన్నారు.
లోక్ సభ స్థానాలకు అనుగుణంగా జిల్లాల్ని ఏర్పాటు చేస్తామని.. మొత్తం 13 జిల్లాలను 25 లోక్ సభా స్థానాల నేపథ్యంలో పాతిక జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అయితే.. విశాఖ జిల్లాను మూడు జిల్లాలుగా చేయటంతో మొత్తం 26 జిల్లాలను ప్రతిపాదిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇదిలా ఉంటే.. తాజాగా 27వ జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కు అంతకంతకూ పెరుగుతోంది. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన మర్కాపురం.. యర్రగొండపాలెం.. గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్ని కలుపుకొని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని అక్కడి వాసులు కోరుతున్నారు. ప్రభుత్వాల నిరాదరణకు గురైన ఈ ప్రాంతం దశ తిరగాలంటే.. కొత్త జిల్లా ఏర్పాటుతోనే సాధ్యమన్న మాట వినిపిస్తోంది. ఇందులో గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లాలో ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రతిపాదిస్తున్నారు.
ఇంతకాలం ప్రకాశం జిల్లాలో భాగమైన తమను గుంటూరుజిల్లా నుంచి విడవడిన జిల్లాలో కలపటాన్ని ఇక్కడి వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పక్క పక్క జిల్లాలే అయినప్పటికీ.. రెండు జిల్లాల ప్రజల అలవాట్లలో చాలా తేడాలు ఉంటాయన్న వాదనను వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మార్కాపురం జిల్లాను 27వ జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్ కు మద్దతు పెరుగుతోంది. ప్రజల నుంచి పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ఏపీ అధికారపక్ష నేతలు సైతం తమదైన రీతిలో రియాక్టు అవుతున్నారు.
తాజాగా ఏపీ విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ సైతం మర్కాపురం జిల్లా డిమాండ్ ను ప్రస్తావిస్తూ.. పార్లమెంటు స్థానాలుగా కాకుండా మరో ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించే అవకాశం ఉంటే మర్కాపురం జిల్లా ఏర్పాటు చేయటానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. అధినేత ఆగ్రహానికి గురి కాకుండా.. అదే సమయంలో మర్కాపురం జిల్లా ఏర్పాటు కోసం పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఆయన ఆచితూచి అన్నట్లుగా రియాక్టు అయ్యారు. మంత్రి ఆదిమూలపు సురేశ్ తో పాటు మరో మంత్రి బాలినేని సైతం మార్కాపురం జిల్లాకు తన మద్దతును ప్రకటించారు. ప్రాంతాల ప్రాతిపదికన జిల్లా అంశాన్ని దృష్టిలోకి తీసుకుంటే మాత్రం.. రాష్ట్రంలో ఏర్పాటు చేసే మొట్టమొదటి జిల్లా మార్కాపురమేనని బాలినేని పేర్కొనటం గమనార్హం.
ప్రకాశం జిల్లా పశ్చిమాన ఉండే ఈ ప్రాంతం అన్ని విధాలుగా వెనుకబడి ఉందని.. భూగర్భ జలాల మీద ఇక్కడి రైతులు ఆధారపడి జీవిస్తున్నారని.. ఈ ప్రాంతం డెవలప్ కావాలంటే మార్కాపురం జిల్లా కావటమే పరిష్కారంగా మంత్రి సురేశ్ అభిప్రాయపడ్డారు. పార్లమెంటు స్థానాలుగా కాకుండా ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించేందుకు ఏ మాత్రం వీలు ఉన్నా.. మర్కాపురంను జిల్లాగా ప్రకటిస్తామన్న మంత్రుల మాటలు.. కొత్త జిల్లా కోరుకుంటున్న వారికి కొత్త ఆశలు పుట్టిస్తున్నాయి. మరి.. దీనికి ముఖ్యమంత్రి జగన్ ఏమంటారో? ఎలా రియాక్టు అవుతారో చూడాలి.