Begin typing your search above and press return to search.

28మంది మెట్రో సిబ్బంది కరోనా

By:  Tupaki Desk   |   1 Oct 2020 6:45 AM GMT
28మంది మెట్రో సిబ్బంది కరోనా
X
కరోనా మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. కేంద్రం భయపడ్డట్టే ప్రజా రవాణా మొదలైతే కరోనా విస్తృతి పెరుగుతుందని ఆందోళన చెందినట్టే ప్రస్తుతం జరుగుతోంది.

ఆర్టీసీ, రైళ్లు, మెట్రోలకు అనుమతిచ్చిన కేంద్రం ఇప్పుడు వాటిల్లో కరోనా బయటపడుతుండడంతో ఆందోళన చెందుతోంది. తాజాగా మెట్రో రైల్ సర్వీసు సిబ్బందిని కూడా కరోనా తాకింది. ఆన్ లాక్ ప్రారంభం అనంతరం సెప్టెంబర్ 7 నుంచి బెంగళూరు మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి.

అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏకంగా 28మంది మెట్రో సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారి మీడియాకు ఈ విషయం తెలిపారు.కరోనా బారినపడిన వారందరినీ ఐసోలేషన్ కు తరలించిన అధికారులు మెట్రో రైళ్లను శానిటైజ్ చేసేశారు.

కరోనా నియంత్రణలో భాగంగా మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలను కేంద్రం నిలిపివేసింది. కరోనా అన్ లాక్ లో భాగంగా ఇటీవలే ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు తదితర మెట్రో సేవలు మొదలయ్యాయి.

మొదలైన తర్వాతే బెంగళూరు మెట్రో సిబ్బందికి కరోనా టెస్టులు చేయగా.. ఏకంగా 28మందికి బయటపడడం కలకలం రేపుతోంది. కరోనా నియంత్రణకు అన్ని నిబంధనలు పాటిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక కోల్ కతాలో కూడా తాజాగా అక్టోబర్ 4 నుంచి మెట్రో రైల్ సేవలు ప్రారంభమవుతున్నాయి.