Begin typing your search above and press return to search.
యుద్ధంలో 287 ఉక్రెయిన్ చిన్నారులు మృతి
By: Tupaki Desk | 11 Jun 2022 11:46 AM GMTఉక్రెయిన్-రష్యాల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వేల మరణాలు.. లక్షల్లో వలసలు.. ఎక్కడ చూసినా రక్తపాతమే. ఇటీవలే ఈ యుద్ధం మొదలై వంద రోజులు పూర్తి అయింది. ఈ యుద్ధంలో ఎంతో మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. కొందరు తల్లిదండ్రులు పోగొట్టుకుంటే.. మరికొందరు పిల్లల్ని కోల్పోయారు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉక్రెయిన్లో దాదాపు 287 మందికిపైగా చిన్నారులు మృతి చెందినట్లు ఆ దేశ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం వెల్లడించింది. కేవలం మరియుపోల్ని స్వాధీనం చేసుకునే క్రమంలో 24 మంది పిల్లల ప్రాణాలు పోయాయని తెలిపారు. రష్యా ఉక్రెయిన్‌ని ఆక్రమించుకునే దిశగా పౌరులే లక్ష్యంగా విచక్షణరహితంగా కాల్పులు జరిపిందని, ఆ క్రమంలోనే ఈ చిన్నారులంతా మృతి చెందారని వెల్లడించింది.
పశ్చిమ దేశాల పంచన చేరుతోందని ఆరోపిస్తూ ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేపట్టి వంద రోజులకుపైనే అయింది. ఫిబ్రవరి 24న మొదలైన ఈ వినాశకర పోరుకు ముగింపు కనుచూపు మేరలో కనపడటంలేదు. రక్తపాతం, విధ్వంసం అక్కడ సర్వసాధారణ మైపోయాయి. ఈ వార్తలు ప్రపంచానికి నిత్యకృత్యమయ్యాయి. పిడుగుల్లా పడుతున్న బాంబులు.. కుప్పకూలుతున్న భవనాలు.. వీధుల్లో చెల్లాచెదురుగా శవాలు.. సర్వం కోల్పోయి ప్రాణాలు అరచేత పట్టుకుని వలసపోతున్న కుటుంబాలు.. ఇదీ మూడు నెలలుగా ఉక్రెయిన్‌లో నెలకొన్న దుస్థితి. బుచా నగరంలో పెద్ద సంఖ్యలో వెలుగు చూసిన ప్రజల మృతదేహాలు.. మేరియుపొల్‌లో పేలిపోయిన థియేటర్.. రష్యా క్షిపణి దాడితో ధ్వంసమైన క్రామటోర్స్క్ రైల్వే స్టేషన్.. వంటి విధ్వంసక చిత్రాలు మానవాళి మనసులో నుంచి ఇప్పుడప్పుడే తొలగిపోవు.
రష్యా ఉక్రెయిన్‌ని ఆక్రమించుకునే దిశగా పౌరులే లక్ష్యంగా విచక్షణరహితంగా కాల్పులు జరిపిందని, ఆ క్రమంలోనే 287 చిన్నారులు మృతి చెందారని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం తెలిపింది. కేవలం మరియుపోల్ని స్వాధీనం చేసుకునే క్రమంలోనే 24 మంది పిల్లలు చనిపోయినట్లు వెల్లడించింది. ఈ కాల్పుల్లో సుమారు 492 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించింది. అంతేకాదు రష్యా బలగాలు మరియుపోల్‌ని ముట్టడి చేసిన తర్వాత ఆ నగరం శిథిలా నగరంగా మారిపోవడమే కాకుండా వీధుల్లో శవాలు కుళ్లిపోయి అత్యంత దయనీయంగా ఉందని పేర్కొంది.
ఉక్రెయిన్లో ఎక్కడ చూసినా రక్తపాతం.. క్షతగాత్రులు ఆర్తనాదాలు.. గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న శవాలే దర్శనమిస్తున్నాయి. రష్యా దురాక్రమణను ఉక్రెయిన్ దీటుగా తిప్పి కొడుతున్నా.. రష్యా సైనిక శక్తి ముందు ఉక్రెయిన్ బలం సరిపోవడం లేదు. కేవలం ఉక్రెయిన్ భూభాగాలు ఆక్రమించుకోవడమే తమ లక్ష్యమని చెప్పిన పుతిన్.. ఇప్పుడు పౌరులను కూడా టార్గెట్ చేస్తున్నాడు.
ఉక్రెయిన్‌పై సాగిస్తున్న యుద్ధాన్ని ప్రత్యేక సైనిక చర్యగా చెప్పుకుంటున్నరష్యా... ఉక్రెయిన్ సైనిక నిర్యూలన దిశగా యుద్ధ నేరాలకు పాల్పడుతుందంటూ ఐక్య రాజ్య సమితి మాస్కో పై ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 250 మందికి పైగా చిన్నారులు చనిపోయారని, ఐదు మిలియన్ల మందికి పైగా హింసాత్మక భయానక వాతావరణంలో గడుపుతున్నారని పేర్కొంది.
ఉక్రెయిన్, రష్యా పోరు వందో రోజుకు చేరుకున్న వేళ.. యుద్ధాన్ని తక్షణమే ఆపేయాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. "ఎక్కడ చూసినా విధ్వంసమే. గ్రామాలు, పట్టణాలు నాశనమయ్యాయి. ఈ యుద్ధంలో విజేత ఎవరూ ఉండరు. తక్షణమే ఈ పోరును ఆపాలి" అని ఒక ప్రకటన విడుదల చేసింది.