Begin typing your search above and press return to search.
29 నగరాలు.. పట్టణాలకు ఆ డేంజర్!
By: Tupaki Desk | 31 July 2017 4:52 AM GMTతాజాగా వెల్లడైన సమాచారం వింటే షాక్ తినాల్సిందే. దేశంలోని తొమ్మిది రాష్ట్రాల రాజధానులకు.. 20 నగరాలు.. పట్టణాలు భూకంప తీవ్రత అధికంగా ఉన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. అతి తీవ్ర భూకంపం మొదలు తీవ్ర భూకంపాలు సంభవించే ప్రాంతాలుగా ఇవి ఉన్నాయి. ఎక్కువగా భూకంపాలు సంభవించే ప్రాంతాలకు సంబంధించిన వివరాల్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
ఎన్‌సీఎస్ గుర్తించిన నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ.. బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా.. జమ్ముకాశ్మీర్ రాజధాని శ్రీనగర్.. నాగాలాండ్ రాజధాని కోహిమా.. పుదుచ్చేరి.. అసోం రాజధాని గువహటి..సిక్కిం రాష్ట్ర రాజధాని గ్యాంగ్ టక్.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లా.. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్.. మణిపూర్ రాజధాని ఇంఫాల్.. చండీఘర్ లు ఉన్నాయి.
మొత్తం తొమ్మిది రాష్ట్ర రాజధానుల్లో దాదాపు 3 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇవి సెస్మిక్ 4.. 5 జోన్లలో ఉన్నట్లుగా వెల్లడించారు. జోన్ 2ను తక్కువ తీవ్రత కలిగినదిగా.. జోన్ 5 అత్యధిక తీవ్రత ఉన్నదిగా జోన్ 4ను తీవ్రత ఉన్న జోన్ గా పేర్కొన్నారు.
అతి తీవ్రమైన జోన్ 5లో ఉన్న నగరాలు.. పట్టణాలు.. జమ్మూకాశ్మీర్.. హిమాచల్ ప్రదేశ్.. ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రదేశాలుగా పేర్కొన్నారు. అదే సమయంలో రాన్ ఆఫ్ కచ్ (గుజరాత్).. ఉత్తర బిహార్ లు ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు కూడా ఇదే జోన్ లో ఉన్నాయి. జమ్ముకాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలు.. ఢిల్లీ.. సిక్కిం.. ఉత్తర యూపీ.. పశ్చిమబెంగాల్.. గుజరాత్.. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు జోన్ 4లో ఉన్నట్లుగా గుర్తించారు. ఇక.. భుజ్.. ఛండీగఢ్.. అంబాలా.. పశ్చిమబెంగాల్.. గుజరాత్.. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు జోన్ 4.. 5లలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే.. హిమాలయాలు.. ఉత్తరాదితో పాటు.. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పలు ప్రాంతాలకు భూకంప డేంజర్ భారీగా ఉన్నట్లుగా చెప్పక తప్పదు.