Begin typing your search above and press return to search.
2డీజీ డ్రగ్ అన్ని వేరియంట్లపై ప్రభావం చూపుతుందట..!
By: Tupaki Desk | 17 Jun 2021 4:30 AM GMTయాంటీ-కరోనా వ్యాక్సిన్ 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2DG), కరోనావైరస్ యొక్క ఏదైనా కొత్త కరోనా వేరియంట్లకి వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుందని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ తెలిపింది. కరోనా వేరియంట్ల రోజుకో కొత్తది వెలుగులోకి వస్తుండటంతో కొత్త ఔషధాలను అభివృద్ధి చేయడంపై ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు దృష్టిసారించాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2డీజీ డ్రగ్ కరోనా రోగుల పాలిట ఆశాకిరణంగా నిలుస్తోంది. కరోనా బారినపడి మృత్యువుతో పోరాడేవారికి ఈ ఔషధం బాగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్ లో వెల్లడైంది.
కరోనా వైరస్ ప్రభావం మధ్యస్థం నుంచి తీవ్రంగా ఉండే రోగుల శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోకుండా 2డీజీ డ్రగ్ కాపాడుతుంది. త్వరలోనే రోగులకు అందుబాటులో రానున్న ఈ యాంటి కోవిడ్ డ్రగ్ , కరోనా చికిత్సలో కీలకంగా మారనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ డ్రగ్ సామర్థ్యానికి సంబంధించి నిర్వహించిన ఓ తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశం వెల్లడయ్యింది. కరోనా అన్ని వేరియంట్లపైనా ఈ డ్రగ్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వైద్య నిపుణులు అనంత నారాయణ భట్, అభిషేక్ కుమార్, యోగేష్ రాయ్, దివియ యాదగిరిలతో కూడిన బృందం పరిశీలనలో తేలింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మే 1న దీనికి అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. 2డీజీ డ్రగ్ వాడిన తర్వాత వైరస్ వృద్ధి చెందడం తగ్గుతున్నట్లు వైద్య నిపుణులు నిర్ధారించారు. సాచెట్ ప్యాకెట్ రూపంలో ఇది మార్కెట్ లోకి రానుంది. దీని ధరను ఒక్కో సాచెట్ రూ.990గా నిర్ణయించారు. దీన్ని మంచినీళ్లలో కలుపుకుని తాగిన వెంటనే అది పనిచేయడం మొదలుపెడుతుంది.
దీని వినియోగంపై గత వారం మార్గదర్శకాలు విడుదలయ్యాయి. అత్యవసర వినియోగం కింద ఈ డ్రగ్‌కు అనుమతించినట్లు డీఆర్డీవో తెలిపింది. మధ్యస్థ నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న కేసుల్లో మాత్రమే ఈ డ్రగ్‌ను వినియోగించాలని స్పష్టంచేసింది. గరిష్ఠంగా 10 రోజుల పాటు ఈ మందును ఇవ్వొచ్చని తెలిపింది. ఆస్పత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ డ్రగ్ వినియోగించాలి. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, 18 ఏళ్ల లోపువారికి 2-డీజీ డ్రగ్ ఇవ్వొద్దని స్పష్టంచేసింది.