Begin typing your search above and press return to search.
గుడ్ న్యూస్ : మరికొన్ని గంటల్లోనే అందుబాటులోకి 2డీజీ డ్రగ్
By: Tupaki Desk | 15 May 2021 11:30 AM GMTకరోనా మహమ్మారిపై వ్యాక్సిన్ ఓ యుద్ధం చేస్తుంది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నోళ్లు మాస్క్ కూడా పెట్టుకోనక్కర్లేదని అమెరికా ప్రకటించింది. వ్యాక్సినేషన్లో మూడో ప్లేస్ లో ఉన్న మనదేశంలో కూడా జోరుగా టీకాలు వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకు మరిన్ని వ్యాక్సిన్లు స్పీడ్‌గా రెడీ అవుతున్నాయి. ఇప్పటికే కొవిషీల్డ్, కొవాగ్జిన్ లను జనానికి వేస్తుండగా, వాటికి ఇప్పుడు స్పుత్నిక్ వీ తోడైంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచింది భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్ డీవో. కోవిడ్ బాధితుల చికిత్సలో వినియోగించే 2డీజీ డ్రగ్ ను రూపొందించిన డీఆర్డీఓ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ భాగస్వామ్యంతో ఆవిష్కరించింది.
పౌడర్ రూపంలో ఉండే సాచెట్ ను విడుదల చేసింది. 10వేల మోతాదుల మొదటి బ్యాచ్ ను ఈవారంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ, డీఆర్డీఓ అధికారులు కలిసి వెల్లడించారు. వాటిని కరోనా బాధితులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. కరోనాకు వ్యాక్సిన్లే తప్ప మందులు ఇప్పటివరకూ లేవు. ఇప్పుడు వాటి ట్రయల్స్ జరుగుతున్నాయి. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఓ పొడిని తయారుచేసింది. దీన్ని కరోనా రోగులకు ఎమర్జెన్సీ వాడకానికి వాడవచ్చని, భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది. డీఆర్డీవో ఓ ల్యాబులో ఈ పొడిని తయారుచేసింది. ఇందుకు హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సహకారం అందించింది. ఈ కొత్త మందు పేరు 2-DG. ఈ మందు ద్వారా కరోనా పేషెంట్లు త్వరగా రికవరీ అవుతున్నారు. 2-డియోక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఉత్పత్తి హైదరాబాద్ సహా పలు కేంద్రాల్లో త్వరలో ప్రారంభం కానుంది. 2-డీజీ ఔషధ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఇటీవల అనుమతి ఇచ్చింది. ఇది స్వల్ప నుంచి మోస్తరు కరోనా లక్షణాలతో బాధపడుతున్న రోగులపై బాగా పనిచేస్తుందని, కరోనా బాధితులకు ప్రధాన చికిత్స చేస్తూ అదనంగా ఈ ఔషధాన్ని ఇస్తే వారు వేగంగా కోలుకునే అవకాశం ఉంటుందని డీఆర్డీఓ తెలిపింది.
పొడి రూపంలో డ్రగ్ ను నీళ్లలో కలుపుకొని తాగితే వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్డీఓ వివరించింది. ఈ పొడి, కరోనా పేషెంట్ల శరీరంలో కరోనా వల్ల దెబ్బతిన్న కణాలను గుర్తిస్తుంది. అక్కడ వైరస్ కి ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుంది. అందువల్ల వైరస్ నీరసించిపోతుంది. దాని వల్ల వైరస్ ఇక వృద్ధి చెందలేదు. అంతే, అక్కడితో కరోనా ఆగిపోతుంది. క్రమంగా వైరస్ నీరసించి చనిపోతుంటే, కరోనా నయం అయిపోతుంది. ఫలితంగా కణాలు తిరిగి రిపేర్ అయ్యి, బాగవుతాయి. పేషెంట్లు త్వరగా కోలుకుంటారు. మొదటి, రెండు ట్రయల్స్ లో వచ్చిన ఫలితాలతో డిసిజిఐ ఈ మందుకి ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి ఇచ్చింది.కాగా, ప్రస్తుతానికి ఈ మందును టాబ్లెట్లా కాకుండా… పొడి రూపంలో ప్యాకెట్ లో ఇస్తున్నారు. దీన్ని నీటిలో కలుపుకొని తాగుతున్నారు. ఇది వాడిన చాలా మందికి RT-PCR టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందని డీఆర్ డీవో ప్రతినిధులు వివరించారు. అందుకే దీనికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత వచ్చే రిపోర్ట్ ను చూసి ,త్వరలోనే టాబ్లెట్లలా తయారుచేసే అవకాశం కూడా ఉంది.