Begin typing your search above and press return to search.

రేప్ కేసులో ఫూణె కోర్టు సంచ‌ల‌న తీర్పు

By:  Tupaki Desk   |   10 May 2017 4:28 AM GMT
రేప్ కేసులో ఫూణె కోర్టు సంచ‌ల‌న తీర్పు
X
ఫుణె ప్ర‌త్యేక‌ కోర్టు సంచ‌ల‌న తీర్పును ఇచ్చింది. ఐటీ ఉద్యోగినిని సామూహిక అత్యాచారం చేసి.. దారుణంగా చంపేసిన ఉదంతంలో సంబంధం ఉన్న ముగ్గురికి కోర్టు ఉరిశిక్ష‌ను విధించింది. అప్రూవ‌ర్ గా మారిన మ‌రొక‌రికి యావ‌జ్జీవ కారాగార శిక్ష‌ను విధిస్తూ తీర్పును ఇచ్చింది. దాదాపు ఏడేళ్ల పాటు సాగిన విచార‌ణ‌కు ఫుల్ స్టాప్ పెడుతూ.. తాజా తీర్పును వెల్ల‌డించింది.

2009 అక్టోబ‌రు 7న ఫూణె మ‌హాన‌గ‌రంలో సైనెక్రోన్ ఐటీ కంపెనీలో ప‌ని చేసే ఫాట‌క్ పూజారి త‌న విదుల‌ను ముగించుకొని బ‌య‌ట‌కు వ‌చ్చారు. అదే కంపెనీకి చెందిన డ్రైవ‌ర్ యోగేష్ అశోక్ రౌత్ ఆమెను ఇంటి వ‌ద్ద దింపుతామ‌ని కారులో ఎక్కించుకున్నారు. కంపెనీ వ్య‌క్తి కావ‌టంతో ఎలాంటి అనుమానం లేకుండా కారు ఎక్కారు. దారి మ‌ధ్య‌లో డ్రైవ‌ర్‌కు స్నేహితులైన మ‌రో ముగ్గురు (మ‌హేష్ బాలాసాహెబ్ ఠాకూర్‌.. విశ్వాస్) కారు ఎక్కారు. రాజ‌గురున‌గ‌ర్ ప్రాంతంలో ఈ ముగ్గురు క‌లిసి ఐటీ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అనంత‌రం ఆమె డెబిట్ కార్డును బ‌ల‌వంతంగా తీసుకొని రూ.61వేలు డ్రా చేశారు. అనంత‌రం చున్నీతో ఆమె గొంతును నులిమి హ‌త్య చేసిన వారు.. గుర్తు తెలీకుండా ఉండ‌టం కోసం బండరాయితో ఆమె ముఖాన్ని ఛిద్రం చేశారు. మృత‌దేహాన్ని స‌మీపంలో అట‌వీ ప్రాంతంలో ప‌డేశారు.

ఫాట‌క్ మిస్సింగ్ కేసు న‌మోదు కావ‌టం.. గుర్తుతెలియ‌ని మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించ‌టంతో రెండు రోజుల అనంత‌రం ఆమె ఎవ‌ర‌న్న‌ది బ‌య‌ట‌కు వ‌చ్చింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆమె అత్యాచారానికి గురైన విష‌యాన్ని తేల్చారు. ఈ ఉదంతంతో సంబంధం ఉన్న ముగ్గురు నిందితుల‌తో పాటు సెక్యూరిటీ గార్డు రాజేష్ పాండురంగ్ చౌద‌రిని అరెస్ట్ చేశారు. ఈ ఎపిసోడ్ లో సెక్యూరిటీ గార్డు అఫ్రూవ‌ర్ గా మారిపోవ‌టంతో.. ఈ కేసు ఒక కొలిక్కి వ‌చ్చింది. అనంత‌రం కోర్టులో ప్రాసిక్యూష‌న్ త‌ర‌ఫున 37 మందిని.. డిఫెన్స్ త‌ర‌ఫున 13 మంది సాక్ష్యాల్ని గుర్తించిన కోర్టు.. చివ‌ర‌కూ అత్యాచారం చేసింది ముగ్గురేన‌ని తేల్చి.. వారికి ఉరిశిక్ష విదిస్తూ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. ఏడేళ్ల త‌ర్వాత అయినా.. త‌ప్పు చేసిన వారికి త‌గిన శిక్ష ప‌డింద‌ని బాధిత‌రాలి భ‌ర్త‌.. ఆమె కుటుంబ స‌భ్యులు అభిప్రాయ ప‌డుతున్నారు. కాస్త ఆల‌స్యంగా అయినా క‌ఠిన‌శిక్ష ప‌డ‌టంపై ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.