Begin typing your search above and press return to search.
మరో మాల్యా కావాలనుకున్న డేరా బాబా!
By: Tupaki Desk | 15 Sep 2017 1:04 PM GMTడేరా సచ్ఛా సౌద వ్యవస్థను స్థాపించి ఆధ్యాత్మిక సేవ పేరుతో అత్యాచారాలు - లైంగిక దాడులకు తెరలేపిన సచ్ఛా సౌదా వ్యవస్థాపకుడు డేరా బాబా ఉరప్ రాం రహీం - గుర్మీత్ సింగ్ గురించి మరిన్ని ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ఆయన తన ఆశ్రమంలో ఆశ్రయం పొందిన ఇద్దరు సాధ్వీలను లోబరుచుకుని పదే పదే అత్యాచారం చేశారన్న ఆరోపణలతో సీబీఐ విచారణ ఎదుర్కొని ప్రస్తుతం 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాన్ని చూస్తే.. ఆయన జైలు శిక్ష పడిన వెంటనే తప్పించుకుని పారిపోవాలని, మొత్తంగా మరో విజయ్ మాల్యా మాదిరిగా ప్రభుత్వానికి చుక్కలు చూపించాలని పెద్ద ప్లానే వేశాడట.
బాబాకు ఇద్దరు పోలీసులు కూడా సాయం చేశారట. ఈ విషయాలు తాజాగా వెల్లడికావడంతో దేశం మొత్తం నివ్వెర పోయింది. ఈ ఆరోపణలకు సంబంధించి ముగ్గురు పోలీసు సిబ్బందిని హరియాణా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు - ఓ కానిస్టేబుల్ ఉన్నారు. వీరిద్దరూ డేరా బాబాకు కాపలా కోసం ఉన్నారట. అయితే, వీరికి బాబా ఏమంత్రం వేశాడో? ఎలాంటి ఆశ చూపించాడో? అంతే వీరిద్దరూ బాబా వలకు చిక్కుకుపోయారు. ఆయనను తప్పించేందుకు ప్లాన్ వేశారు. గుర్మీత్ ను తన అనుచరుల మధ్యకు తీసుకెళ్లి తప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయి.
ఇందుకు హెడ్ కానిస్టేబుళ్లు అమిత్ - రాజేశ్ - కానిస్టేబుల్ రాజేశ్ సాయం చేశారు. అయితే, ఆఖరి నిముషంలో ఈ ప్రయత్నం ఉన్నతాధికారులకు తెలిసిపోయింది. హుటాహుటిన రంగంలోకి దిగి వీరి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అంతేకాదు, ఈ ముగ్గురు సిబ్బందినీ.. అరెస్టు చేసి.. కోర్టులో హాజరుపరిచారు. అంతేకాదు, కోర్టు అనుమతితో వీరు తమ కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. మొత్తానికి ఈ వ్యవహారం చిలికిచిలికి గాలివానయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గుర్మీత్ ను తప్పించడం వెనుక కేవలం పోలీసులు మాత్రమే ఉన్నారా? లేక బయట నుంచి పెద్దలు ఎవరైనా చక్రం తిప్పారా? అన్నది తేలితేనే అసలు విషయం బయటపడుతుంది.