Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్ గా మారిన డోభాల్ హైదరాబాద్ టూర్

By:  Tupaki Desk   |   30 Nov 2022 3:30 AM GMT
హాట్ టాపిక్ గా మారిన డోభాల్ హైదరాబాద్ టూర్
X
అజిత్ డోభాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జాతీయ భద్రత సలహాదారుగా వ్యవహరించే ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో అస్సలు అర్థం కాదు. దేశాన్ని పాలించేది నరేంద్ర మోడీనే అయినా.. ఆయన పాలనకు కీలకభూమిక పోషించే అతి కొద్ది మందిలో డోభాల్ ఒకరు.

ఆయన ఒక చోటకు వచ్చారంటే దానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఊరికే రారు మహానుభావులు అన్నట్లుగా.. అజిత్ డోభాల్ ఒకప్రాంతానికి రావటం.. అది కూడా రహస్యంగా రావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అజిత్ డోభాల్ మంగళవారం హైదరాబాద్ మహానగరానికి వచ్చారు. ప్రత్యేక విమానంలో నగరానికి వచ్చిన ఆయన.. మొత్తంగా మూడు గంటల పాటు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. ఆయన ఎవరిని కలిశారు? ఎందుకు కలిశారు? అసలు ఆయన టూర్ ను ఎందుకంత రహస్యంగా ఉంచారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు లభించని పరిస్థితి.

ఇంతకీ డోభాల్ ఎందుకు వచ్చినట్లు? తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కారుకు కేంద్రంలోని మోడీసర్కారు మధ్య పెద్ద పోరాటమే నడుస్తోంది. ఇలాంటి వేళలో డోభాల్ ఎంట్రీ దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు తీవ్రమైన చర్చకు తెర తీసింది.

ఇటీవల కాలంలో తెలంగాణలోని పలువురు ప్రముఖుల మీద ఐటీ.. సీబీఐ.. ఈడీ దాడులు జరుగుతున్న వేళ.. వాటికి సంబంధించి అంశాలపై రివ్యూ కోసం హైదరాబాద్ వచ్చారా? లేదంటే వేరే కారణం మీద వచ్చారా? అన్నది ప్రశ్నగా మారింది.

ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వచ్చిన డోభాల్ టూర్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీసులకు కానీ.. నిఘా వర్గాలకు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అంత రహస్యంగా ఈ టూర్ ను ఎందుకు ఉంచినట్లు? అన్నది ఒక ప్రశ్న.

ఇండియన్ జేమ్స్ బాండ్ గా ఆయన్ను అభివర్ణిస్తారు. ఏదైనా అండర్ కవర్ ఆపరేషన్ అయితే రోజుల తరబడి మారు వేషంలో ఉండిపోయే అలవాటున్న డోభాల్ కు సీక్రెట్ మిషన్లలో కీలకంగా వ్యవహరిస్తుంటారు. అలాంటి డోభాల్ తాజాగా హైదరాబాద్ కు రావటం వెనుక ఉగ్రకుట్రకు సంబంధించిన ఏమైనా విషయాలు ఉన్నాయా? తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన పర్యటన సాగిందా? అన్నది తేలాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.