Begin typing your search above and press return to search.

అమెరికాలో 11 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డ 3 భారతీయులు

By:  Tupaki Desk   |   31 Oct 2022 5:09 AM GMT
అమెరికాలో 11 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డ 3 భారతీయులు
X
అమెరికాలో భారతీయులు ఆ దేశాన్ని అగ్రపథాన నిలపడంలోనే కాదు.. పలు అక్రమాల్లోనూ వారి పాత్రలు బయటపడుతుండడం కలకలం రేపుతోంది. ఇటీవల సినిమా టిక్కెట్ల మోసంలో భారతీయ విద్యార్థులపై ఆరోపణలు వచ్చాయి.

తాజాగా మరో కాల్ సెంటర్ మోసంలోనూ ముగ్గురు భారతీయులు అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది. కాల్ సెంటర్‌లతో సంబంధం ఉన్న మోసం , మనీలాండరింగ్ కుట్రకు పాల్పడినందుకు ముగ్గురు భారతీయ వ్యక్తులపై అభియోగాలు మోపారు. ముగ్గురు నిందితులు అమెరికాలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు అయినప్పటికీ భారతదేశంలోని కాల్ సెంటర్ల ద్వారా తమ కార్యకలాపాలు సాగించారు.

ఇల్లినాయిస్‌లోని డెస్ ప్లేన్స్‌కు చెందిన అమీర్‌సిన్హ్ దివాన్(42), జహీన్ రఫిక్‌భాయ్ మాల్వి(28), డెస్ ప్లేన్స్‌కు చెందిన 37 ఏళ్ల సోహిల్ ఉస్మాంగాని వహోరాలు ఈ ప్రధాన కుట్రదారులలో ఉన్నారు. మొదటి ఇద్దరు అర్కాన్సాస్‌లోని కోర్టు ముందు హాజరుకానుండగా, వహోరా తరువాత తేదీలో హ్యూస్టన్‌లో హాజరవుతారు.

ఈ ముగ్గురు కాల్ సెంటర్ల ద్వారా మోసానికి పాల్పడ్డారు. అమెరికా ప్రభుత్వ అధికారులం అంటూ కాల్స్ చేసి మోసం చేసినట్టు గుర్తించారు. వారి ఆస్తులను రక్షించడానికి, అరెస్టును నివారించడానికి.. ప్రభుత్వ ప్రయోజనాలను నిలిపివేయకుండా నిరోధించడానికి డబ్బు పంపమని ప్రజలను మోసగించారు.

ఈ మోసంలో తమ గిఫ్ట్ వోచర్‌లను లిక్విడేట్ చేసి, నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించి వాల్‌గ్రీన్స్ లొకేషన్‌లలో నగదు ఉన్న తమ ప్యాకేజీలను తీసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. మొత్తం మీద వారు బాధితుల నుండి $11 మిలియన్లకు పైగా మోసం చేశారని పోలీసుల విచారణలో తేలింది. దోషులుగా తేలితే ముగ్గురు భారతీయులకు కనీసం 20 ఏళ్లపాటు ఫెడరల్ జైలు శిక్ష పడనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.