Begin typing your search above and press return to search.
ఏపీలో 3 లక్షల ఉద్యోగాలు.. సీఎం జగన్ ప్రకటన!
By: Tupaki Desk | 15 Jun 2022 4:02 PM GMTకేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు తాజాగా 10 లక్షల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలసిందే. ఇప్పుడు ఇదే బాటలో ఏపీ సీఎం జగన్ కూడా పయనిస్తున్నారు. త్వరలోనే రాష్ట్రంలో 3 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తామని ప్రటించారు.
రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా పెద్దఎత్తున ఉపాధి లభించనున్నట్లు జగన్ స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు భూములు లీజుకిచ్చిన రైతులకు ఎకరానికి ఏడాదికి 30 వేల రూపాయలు ఇచ్చే విధానం తీసుకువస్తున్నట్లు తెలిపారు. రైతు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు.
పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. త్వరలో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహణకు సమాయత్తమవుతున్నామని సీఎం జగన్ తెలిపారు. ఈ పరిశ్రమల ద్వారా 2,19,766 కోట్ల పెట్టుబడుల రానున్నట్లు తెలిపారు. తద్వారా భారీగా ఉపాధి కల్పన, జరుగుతుందని,3,19,829 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. వీటికి సంబంధించి ప్రభుత్వం ఒక స్పష్టతతో ఉందన్నారు.
పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. విశాఖపట్నం-చెన్నై కారిడార్‌లో భాగంగా ఉన్న నక్కపల్లి నోడ్, శ్రీకాళహస్తి నోడ్‌లపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నట్టు అధికారులు తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నాయని, ఎంఎస్‌ఎంఈలకు చేదోడుగా నిలవాలని సీఎం సూచించారు. పారిశ్రామిక ప్రోత్సహకాలు వారికి అందేలా చూడాలన్నారు.
రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూలేని విధంగా పారిశ్రామిక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయని, భజాంకాలు, బంగర్లు, సింఘ్వీలు, బిర్లాలు లాంటి వారంతా రాష్ట్రానికి వస్తున్నారన్నారు. అదానీ కూడా ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నా రని, తమ ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధితో అడుగులు ముందుకేస్తున్నారని తెలిపారు. ఇక్కడకు వచ్చిన తర్వాత పూర్తిస్ధాయి మద్ధతు ఇస్తున్నామన్నారు. మనం చేసే పనులలో నిజాయితీ ఉంది కాబట్టి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు వస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా పెద్ద మొత్తంలో ఉపాధి లభించనుందని సీఎం తెలిపారు. వీటిపై ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయని, దాదాపు 66వేల ఎకరాలకుపైగా భూమిని ఈ ప్రాజెక్టులకు వినియోగించాల్సి ఉంటుంద న్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా బీడు భూములున్న వారికి మంచి ఆదాయం రానుందని, బీడు భూములను లీజు విధానంలో తీసుకుని, ఏటా ఎకరాకు దాదాపు 30 వేలు చెల్లించేలా నూతన విధానం తీసుకువస్తున్నామన్నారు. అంతేకాక రైతుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు కల్పించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.