Begin typing your search above and press return to search.
ఏమైపోతారో? తాలిబన్ల 3 తాజా ఆరాచకాలు
By: Tupaki Desk | 25 Aug 2021 2:18 AM GMTఅనుకున్నదే జరుగుతోంది. అంచనాలు నిజమవుతున్నాయి. ఎంత పాలు పోసి పెంచినా పాము పామే కానీ.. మనిషి కాలేదు కదా? అలానే ఆరాచకాన్ని అణువణువులో పట్టించుకొని మతోన్మాదంతో ఊగిపోతు.. తమకు జన్మనిచ్చిన తల్లుల్ని బానిసలుగా.. ఆ మహిళా జాతిని రాచి రంపాన పెట్టటమే కాదు..ఆడదానిగా ఈ భూమ్మీద ఎందుకు పుట్టానురా భగవంతుడా? అన్న భావన కలిగేలా చేయటంలో తాలిబన్లకు మించినోళ్లు మరొకరు ఉండరు. కనిపించని పిశాచాలకు ప్రతిరూపంగా మనుషుల కళ్ల ముందు తిరిగే ఈ ఆరాచకవాదులు ఆఫ్గాన్ లో చెలరేగిపోతున్నారు.
సురీడు ఉదయించింది మొదలు అస్తమించే వరకు.. రాత్రిళ్లు కూడా వీరి దారుణాలకు అంతుపొంతు లేని పరిస్థితి. ఇంత జరుగుతున్నా మనుషుల మాదిరే ప్రకృతి కూడా పట్టనట్లుగా ఉండిపోవటం చూస్తే.. తాలిబన్లకు పోయేకాలం ఎప్పుడన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికే భారీ విధ్వంసానికి తెర తీసిన వారు.. తాజాగా చేసిన ఐదు ఆరాచకాల విషయానికి వస్తే..
1. తమ చేతికి అధికారం వచ్చినంతనే.. మహిళల మీద ఆంక్షల్ని విధిస్తున్న తాలిబన్లు.. తాజాగా మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వారు బయటకు రాకూడదని స్పష్టం చేశారు. తాము చెప్పినట్లుగా ఇంటికే పరిమితం కావాలని.. భద్రతా సిబ్బంది అనుమతిస్తేనే బయటకు రావాలని వారు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో.. మొన్నటి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసిన మహిళలు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ ఇంటి నుంచి బయటకు రావటానికి వణికిపోతున్న దుస్థితి.
2. అమెరికా అంచనాలకు మించి తాలిబన్లు చాలా వేగంగా కాబూల్ ను ఎలా సొంతం చేసుకోగలిగారు. వారంత తేలిగ్గా ఎలా రాగలిగారు? అంచనాలు ఎందుకు తారుమారు అయ్యాయి? తాలిబన్లు అంతలా ఎలా చేలరేగారు? లాంటి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. తాజాగా వీటికి సంబంధించిన వాస్తవాలు బయటకు వచ్చాయి. అప్గాన్ ను అంత తేలిగ్గా తాలిబన్లు వశం చేసుకోవటం వెనుక అధ్యక్షుడు అష్రఫ్ ఘనీకి అత్యంత సన్నిహితుడి మిర్వాయిన్ యూసినీ హస్తం ఉందని తేల్చారు. అధ్యక్షుల వారి వద్దే ఉండి.. నిత్యం తాలిబన్లను విమర్శించే అతడు.. మరోవైపు తాలబన్లకు లోపాయికారీగా సాయం అందించాడు. ఈ కారణంతోనే తాలిబిన్ల దురాక్రమణ అంత త్వరగా.. ఈజీగా అయిపోవటానికి కారణం పక్కా ప్లానింగేనని చెప్పాలి.
నిజానికి కాబూల్ అంత తేలిగ్గా తాలిబన్ల వశం కాదని భావించింది అమెరికా.. అందుకు భిన్నంగా పక్కనే ఉండి నమ్మకం ద్రోహం చేసిన మిర్వాయిస్ పుణ్యమా అని షాకింగ్ పరిణామాలు చోటుచేసుకున్నట్లుగా గుర్తించారు. వాస్తవానికి తాలిబన్ల చేతికి కాబూల్ అంత త్వరగా రాదన్న అంచనాతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ సైతం ట్రిప్ కు బయలుదేరారు. అప్గాన్ ఇష్యూ తాలిబన్ల చేతికి రావటానికి ముందుగా అనుకున్న అంచనాలు తప్పు కావటంతో.. బైడెన్ అలెర్టు అయ్యారని చెబుతారు.
3. తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో ఇప్పుడు కొత్త భయం మొదలైంది. గతంలో ఒక ఊపు ఊపిన ఆల్ ఖైదా తో తాలిబన్లకు మొదలయ్యే స్నేహం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే తాలిబన్ల కారణంగా ఆఫ్గాన్ లోని చాలామంది బిక్కుబిక్కుమంటూ బతకటమే కాదు.. ఏ మాత్రం అవకాశం అభించినా దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థ తాలిబన్ల దన్నుతోమళ్లీ క్రియాశీలకంగా మారాలని భావిస్తున్నారు. అదే జరిగితే.. ప్రపంచానికి మరో పెద్ద ముప్పు వాటిల్లినట్లే అవుతుంది.