Begin typing your search above and press return to search.
తీవ్ర ఉత్కంఠ: ఒంగోలులో కరోనా కలవరం
By: Tupaki Desk | 29 March 2020 9:38 AM GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కలవర పెడుతోంది. ఇన్నాళ్లు తక్కువ సంఖ్యలో ఉన్న కరోనా కేసులు రెండు పదులకు చేరాయి. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఒంగోలులో కూడా పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా ఒంగోలు జిల్లాలో మూడు కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ప్రజలు లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి నుంచి బయటకు రావడం మానేశారు. ఎవరికి సోకుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. అయితే కరోనా పాజిటివ్ సోకిన వారు జిల్లాలో ఎక్కడెక్కడ తిరిగారో.. ఎవరిని కలిశారోనని వివరాలు సేకరిస్తున్నారు.
ఒంగోలులో ఈనెల 19వ తేదీన ఓ యువకుడికి కరోనా వైరస్ సోకింది. ఇప్పుడు తాజాగా ఓ మత పెద్దతో పాటు ఆయన భార్యకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రకాశంలో మూడు పాజిటివ్ కేసులు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే కరోనా సోకిన వారందరూ చీరాల వాసులే కావడంతో చీరాల ప్రాంతంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ వివరాలు తెలుసుకున్న నాటి నుంచి బయటకు రావడం లేదు. కంగారు పడుతున్నారు.
అధికార యంత్రాంగం స్పందించి పటిష్ట చర్యలు చేపడుతోంది. కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ ను సంపూర్ణంగా అమలుచేస్తున్నారు. పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేయిస్తున్నారు. ఆ యువకుడితోపాటు మత పెద్ద దంపతులు తిరిగిన ప్రాంతాలను గుర్తిస్తున్నారు. ఆ సమయంలో వారితో పాటు ఉన్నవారు, వారు ప్రయాణించిన వాహనాలు ఏమిటి? ఎక్కడెక్కడ తిరిగారు? అనే వివరాలు సేకరిస్తున్నారు. వారి వివరాలు సేకరించి వారికి ఏమైనా కరోనా లక్షణాలు ఉన్నాయేమోనని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు బయటకు రాకుండా చూసుకుంటున్నారు. కరోనా అనుమానితులు ఉంటే హోం క్వారంటైన్ కు పంపిస్తున్నారు.