Begin typing your search above and press return to search.
ముగ్గురు అక్కా చెల్లెళ్లకు ఒకే ఒక్క కృష్ణుడు
By: Tupaki Desk | 20 Oct 2019 5:09 AM GMTసోషల్ మీడియా పుణ్యమా అని కొత్త.. కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజా ఉదంతం కూడా ఈ కోవకు చెందిందే. ఇప్పుడున్న డిజిటల్ యుగంలోనూ ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఏరికోరి మరీ ఒక్కరినే ఇష్టపడి పెళ్లాడటమే కాదు.. వారు ముగ్గురు అమితంగా ఆరాధించే తీరు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. ప్రస్తుతం ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. తమ భర్తను జల్లెడలో నుంచి చూసే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
అశ్వయుజ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజును కర్వాచౌత్ అంటారు. ఉత్తరాదిన ఈ రోజును హిందూ మహిళలు పరమపవిత్రంగా భావిస్తారు.ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ ఎంగిలి పడకుండా ఉంటారు. ఏమీ తినకుండా ఉండి.. తమ భర్త నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని దేవుడ్ని కోరుకుంటారు.
రాత్రి వేళలో ఆకాశంలో చంద్రుడ్ని చూసి.. జల్లెడలో భర్తను చూసిన తర్వాత ఏమైనా ఆహారం తీసుకుంటారు. ఇదిలా ఉండే మధ్యప్రదేశ్ కు చెందిన శోభ.. రీనా.. పింకి అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. పన్నెండేళ్ల క్రితం చిత్రకోట్ కు చెందిన కృష్ణ అనే వ్యక్తి ఇష్టపడి పెళ్లాడారు.
పెళ్లి జరిగిన పుష్కరం తర్వాత కూడా భర్త మీద ఇసుమంత ప్రేమాభిమానాలు తగ్గకుండా.. కర్వాచౌత్ రోజు రాత్రి తమ భర్త ముఖాన్ని ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి జల్లెడలో నుంచి చూస్తున్న ఫోటో వైరల్ గా మారింది. ముగ్గరు అక్కాచెల్లెళ్లకు ఒకే ఒక్కడు.. ఈ అభినవ కృష్ణుడు అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.