Begin typing your search above and press return to search.
ఆస్ట్రేలియాలో ముగ్గురు తెలంగాణ వాసుల మృతి
By: Tupaki Desk | 18 Dec 2018 9:37 AM GMTఆస్ట్రేలియా విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం చెందారు. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ లో జరిగిన పడవ ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు, హైదరాబాద్ వాసి చనిపోయారు.
న్యూ సౌత్ వేల్స్ తీరంలోని సముద్రంలో వీరు పడవలో ప్రయాణిస్తుండగా.. అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నల్గొండలోని మన్యం చెల్కకు చెందిన గౌసుద్దీన్ (45), అతడి అల్లుడు జునేద్ (28), హైదరాబాద్ బీహెచ్ఈఎల్ కు చెందిన రాహత్ (35) మృతిచెందారు. వీరిలో గౌసుద్దీన్, రాహత్ ల మృతదేహం లభ్యం కాగా.. జునేద్ జాడ కనిపించలేదు. అతడి మృతదేహం కోసం వెతుకుతున్నారు. ఇదే బోటులో ప్రయాణిస్తున్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
కాగా ఆస్ట్రేలియాలో నల్గొండ వాసుల దుర్మరణంపై మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆస్ట్రేలియా నుంచి వీరి మృతదేహాలను స్వదేశానికి తీసుకురావాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.