Begin typing your search above and press return to search.
నియామకాల్లో వివక్ష....టీసీఎస్ పై కేసు!
By: Tupaki Desk | 25 Sep 2018 11:12 AM GMTఅమెరికా అధ్యక్షుడు ట్రంప్....అమెరికన్లలో లోకల్ సెంటిమెంట్ ను రెచ్చగొడుతోన్న సంగతి తెలిసిందే. అమెరికాలో విదేశీయులు పనిచేసేందుకు కీలకమైన హెచ్1-బి వీసాలను నియంత్రించేందుకు ట్రంప్ కఠిన నిబంధనలు విధిస్తోన్న సంగతి తెలిసిందే. అదే క్రమంలో తాజాగా హెచ్-4 డిపెండెంట్ వీసాలపై కూడా ట్రంప్ ఆంక్షలు విధించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. హెచ్-4 వీసాపై వచ్చే భాగస్వాములు ఉద్యోగాలు చేసేందుకు వీలు లేకుండా మరో 3 నెలల్లో హెచ్-4 వీసాలను రద్దు చేయనున్నట్లు ఫెడరల్ కోర్టుకు ట్రంప్ సర్కార్ తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా భారతీయ సాఫ్ట్ వేర్ దిగ్గజ కంపెనీ టీసీఎస్ కు ముగ్గురు అమెరికన్లు షాకిచ్చారు. తమపై జాతి వివక్ష చూపుతూ...తమకు టీసీఎస్ లో ఉద్యోగాలు ఇవ్వలేదంటూ ఆ కంపెనీపై ముగ్గురు అమెరికన్లు కేసు వేశారు.
డారెల్ స్టేసీ - డొనాల్డ్ స్టీఫెన్ - హేషమ్ హఫీజ్ అనే ముగ్గురు అమెరికన్లు....న్యూజెర్సీలోని డిస్ట్రిక్ట్ కోర్టులో టీసీఎస్ పై గత నెలలో లాసూట్ ఫైల్ చేశారు. సుశిక్షుతులైన అమెరికన్లు ఉన్నప్పటికీ.....వీసాలపై విదేశీలయులను పిలిపించి...వారినే తమ సంస్థలో టీసీఎస్ నియమించుకుంటోందని వారు ఆరోపించారు. అందులోనూ ప్రత్యేకించి భారతీయులను, దక్షిణాసియా వారికి అధిక ప్రాధాన్యత దక్కుతోందని వారు ఆరోపించారు. తమకు అన్ని అర్హతలున్నా....ఉద్యోగాలు దక్కడం లేదని ఆరోపించారు. ఇప్పటికే ఇన్ఫోసిస్ పై కూడా ఈ తరహా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లోకల్ అమెరికన్లకు ఉద్యోగాలివ్వాలంటూ,....టీసీఎస్ - ఇన్ఫోసిస్ లపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది.