Begin typing your search above and press return to search.
పుణెలో బాబు పరువు తీసిన బెజవాడ కార్పొరేటర్లు
By: Tupaki Desk | 4 May 2016 12:20 PM GMTతెలుగు దేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారు పేరు. దేశవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ఈ విషయంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే.... అప్పుడప్పుడు కట్టు తప్పే ఈ పార్టీ నేతలు ఇటీవల తరచూ ఏదో ఒక వివాదాల్లో ఆరోపనలు ఎదుర్కొంటున్నారు. తాజాగా టీడీపీకి చెందిన కార్పొరేటర్లు కొందరు మహారాష్ట్రలో వివాదంలో చిక్కుకున్నారు. పుణె రైల్వే స్టేషన్ లో ఓ మహిళను వేధిస్తూ అక్కడి పోలీసులకు దొరికిపోయారు.
విజయవాడకు చెందిన నలుగురు టీడీపీ కార్పొరేటర్లు ఇటీవల విహారయాత్ర కోసం పుణె వెళ్లారు. అక్కడ బాగా మందు కొట్టిన తరువాత అక్కడ రైల్వే స్టేషన్ లో ఒక మహిలను చూసి వీరు ఆమె వెంట పడ్డారట. వెంటపడి వేధిస్తున్న క్రమంలో రైల్వే పోలీసులు వీరిని గమనించి పట్టుకున్నారు. వారిపైనా వీరు తమ దూకుడు చూపించాలనుకున్నారట. తాము ఏపీలో టీడీపీ లీడర్లమని వదిలేయాలని చెప్పారట. వారు లెక్కచేయకపోవడంతో చివరకు బతిమలాడుకున్నారట. అయినా వారు వినకపోవడంతో విజయవాడకు చెందిన కొందరు టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారట. వారు రంగంలోకి దిగి విషయం బయటకు పొక్కకుండా వారిని విడిపించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
క్రమశిక్షణకు మారుపేరైన పార్టీ నేతలు ఇలా పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ పిచ్చిపిచ్చి వేషాలేస్తే జాతీయ స్థాయిలో అందరికీ పరిచితుడైన టీడీపీ అధినేత చంద్రబాబుకు అది మచ్చగా మారుతుందని.. ఇలాంటి వారిపై పార్టీ పరంగా కఠిన శిక్షలు వేయాలని నేతలు అంటున్నారు.